Crocodile Bark Tree | ప్రకృతి మానవాళికి ఒక వరం. చెట్లు, మొక్కలు లేని భూ ప్రపంచాన్ని మచ్చుకైనా ఊహించుకోలేము. భూమిపై మనిషి ఉన్నంత కాలం చెట్లు, పక్షులు ఉండాల్సిందే. చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్‌ను మనం పీల్చుకొని జీవిస్తున్నాం. అయితే ప్రకృతిలో ఉండే వింతలు, విశేషాలు అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. వెరైటీగా ఉండే చెట్లు, రకరకాల పక్షులు అప్పుడప్పుడు మనకు తారసపడుతూ ఆశ్చర్యాన్ని రేకేత్తిస్తాయి. అయితే ఒక చెట్లు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్ధాం!
చెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఇస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ స్వచ్ఛమైన నీటిని ఇస్తుంది అంటే నమ్ముతారా?. చెట్టు నుంచి నీరు రావడం ఏమిటి అని అనుకుంటున్నారేమో… ఇది అక్షరాల ప్రకృతి దైవ సంకల్పం. ఇది నిజమైన చెట్టు. ఈ చెట్టు నుంచి వచ్చే నీళ్లు తాగడానికి కూడా ఉపయోగిస్తున్నారు. తాగుతున్నారు కూడా. ఈ చెట్టు పేరు క్రోకోడైల్ బార్క్ ట్రీ(Crocodile Bark Tree). అంటే మొసలి తోలు చెట్టు అని అర్థం. దీని శాస్త్రీయనామం Terminalia Elliptica.ఈ చెట్టును కత్తితో కట్ చేస్తే నీరు చిమ్మిచ్చికొడుతుంది. నిరంతరం నీళ్లు వస్తూ అబ్బుర పరుస్తుంది. 30 మీటర్ల ఎత్తు గల ఈ చెట్లు పొడి, తేమ గల నేలపైన జీవిస్తుంటాయి. వాటి కాండం నీటితో నిండి ఉంటుంది. కట్ చేసిన వెంటనే ఫోర్స్‌తో ఆ చెట్టులో నుండి నీరు వస్తుంది.

ఈ ప్రస్తుతం చెట్టు నుంచి నీరు రావడం వీడియోను ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ దిగ్వజయ్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేశారంట. ఇప్పుడు ఈ నీరు వస్తున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి అగ్ని ప్రమాదాలను కూడా తట్టుకుంటాయి. ఎండాకాలంలో ఫారెస్టు ఆఫీసర్లు అడవుల్లో తిరుగుతున్నప్పుడు వారు దాహం వేస్తే ఈ చెట్ల నుండి వచ్చే నీటిని తాగవచ్చు. ఈ స్వచ్ఛమైన నీరు తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని తాగిన వారు అంటున్నారు. నిజంగా ఈ చెట్టు గ్రేట్ కదా!.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!