తెలంగాణ‌

Crime news today: రిటైర్డ్ అసిస్టెంట్ స‌బ్ ఇన్పెక్ట‌ర్ అరెస్ట్‌

Crime news today

Crime news today: నారాయ‌ణగూడ: స‌ర్టిఫికెట్స్ ఫోర్జ‌రీ చేసిన కేసులో ఓ రిటైర్డ్ ఏఎస్సైను నారాయ‌ణ గూడ పోలీసులు అరెస్టు చేశారు. 2018 లో హైదారాబాద్ సంతోష్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ నుండి ఏఎస్సైగా రిటైర్డ్ అయిన మ‌హ‌మూద్ అబ్దుల్ ర‌వుఫ్ రిటైర్డ్ అయిన త‌ర్వాత త‌న స‌ర్వీస్ ను మ‌రో రెండేళ్లు పొడిగించేందుకు త‌న స‌ర్టిఫికెట్స్‌లో డేట్ ఆఫ్ బ‌ర్త్‌ను 1960 నుండి 1962 కు మార్ఫింగ్ చేశారు.

త‌న‌కు ఇంకా రెండేళ్లు స‌ర్వీస్ ఉందంటూ 2018లో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు మార్ఫింగ్ స‌ర్టిఫికెట్స్‌ను అంద‌జేశారు. అధికారుల వెరిఫికేష‌న్‌లో స‌ర్టిఫికెట్స్ మార్ఫింగ్ చేసిన‌ట్టు తేల‌డంతో ర‌వూఫ్ పై నారాయ‌ణ‌గూడ పోలీసుల‌కు క‌మిష‌న‌ర్ కార్యాల‌య అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు కావ‌డంతో గ‌త మూడేళ్లుగా త‌ప్పించుకుని తిరుగుతున్న ర‌వుఫ్ విశ్వ‌స‌నీయ స‌మాచారంతో గురువారం అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌గూడ పోలీసులు రిమాండ్‌కు తర‌లించారు.

See also  New Political Party : కొత్త పార్టీ పెడ‌తారా? ఈట‌ల నిర్ణ‌యం ఏమిటి?

Comment here