crime news today

crime news today:అర్ధ‌రాత్రి నిద్ర‌లేపి మార‌ణాయుధాల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తిపోట్లు

Spread the love
  • రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌

crime news today: రాజ‌మహేంద్రవ‌రం: న‌గ‌రంలో బ్లేడ్ బ్యాచ్‌ల‌కు రౌడీ షీట‌ర్ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో భాగంగా శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత స్థానిక ప‌న‌స చెట్టు ఏరియా వ‌ద్ద ఒక రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

వివ‌రాల్లోకి వెళితే.. మూడో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సిటిఆర్ఐ ప‌రిధిలోని నివాసం ఉంటున్న దొంగ రెడ్డి (28) అనే రౌడీషీట‌ర్ కు అత‌ని ప్ర‌త్య‌ర్థులు బ్లేడ్ బ్యాచ్ షూట‌ర్ సాయి, రౌడీషీట‌ర్ ల‌క్ష్మ‌ణ్ మ‌రో ఇద్ద‌రుతో పాత క‌క్ష‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌త నాలుగు రోజులుగా ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా శుక్ర‌వారం రాత్రి కూడా ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది.

అనంత‌రం ఎవ‌రి ఇళ్ల‌కు వాళ్లు వెళ్లిపోయాన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. త‌ర్వాత మ‌ద్యం మ‌త్తులో ఉన్న షూట‌ర్ సాయి అర్ధ‌రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మేడ‌పై ప‌డుకున్న దొంగ రెడ్డిని నిద్ర లేపాడు. వెంట తెచ్చుకున్న మారణాయుధాల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా(crime news today) న‌రికారు. ర‌క్త‌పు మ‌డుగులో దొంగ రెడ్డి అక్క‌డికక్క‌డే కుప్ప‌కూలి ప్రాణాలు వ‌దిలాడు.

దొంగ రెడ్డి

స‌మాచారం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. శ‌వ పంచ‌నామా నిర్వ‌హించారు. దీనిపై మూడో ప‌ట్ట‌ణ సీఐ మ‌ధుబాబు మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామ‌ని తెలిపారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య పాత క‌క్ష‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ దారుణ హ‌త్య జ‌రిగింద‌న్నారు. రౌడీ షీట‌ర్ దొంగ రెడ్డి హ‌త్య‌తో న‌గ‌రం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. వ‌రుస నేరాల‌తో న‌గ‌ర ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌ Visakhapatnam : విశాఖ‌ప‌ట్ట‌ణంలో దారుణం చోటుచేసుకుంది. తాటిచెట్ల‌పాలెం సంతోషి మాత ఆల‌యం స‌మీపంలో Read more

The baby: అట్ట‌పెట్టెలో చిన్నారిని వ‌దిలివెళ్లిన వైనం | కాపాడిన కాటికాప‌రి!

The baby: రాజ‌మండ్రి: తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అట్ట‌పెట్టెలో తీసుకొచ్చిన శిశువును శ్మ‌శానంలో వ‌దిలేసి వెళ్లిపోయారు. కొన ఊపిరితో Read more

Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాల‌యాల‌ను ర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాల‌యాల‌ను ర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లంRajamahendravaram: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ విగ్ర‌హాల దాడి ఘ‌ట‌న వెలుగు చూసింది. Read more

chinnagottigallu: చిన్న‌గొట్టిగ‌ల్లు లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

chinnagottigallu చిన్న‌గొట్టిగ‌ల్లు: చిత్తూరు జిల్లా చిన్న‌గొట్టిగ‌ల్లు మండ‌ల కేంద్రంలో దారుణ హ‌త్య వెలుగు చూసింది. చిన్న‌గొట్టిగ‌ల్లు మండ‌ల కేంద్రంలోని వార‌పుసంత రేకుల షెడ్డులో నివ‌సిస్తూ చిన్న‌గొట్టిగ‌ల్లు బ‌స్టాండ్ Read more

Leave a Comment

Your email address will not be published.