crime news: వరంగల్: అంత్యక్రియలకు డబ్బుల్లేవని ఓ మనవడు తాత చనిపోవడంతో ఫ్రిజ్‌లో మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పరకాలలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలయ్య వయస్సు 93 సంవత్సరాలు. తన మనమడు నిఖిల్‌తో కలిసి పరకాలలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వృద్ధుడు బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో మూడురోజుల క్రితం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బల్లేకపోవడంతో తాత మృతదేహాన్ని మనవడు నిఖిల్ ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో పెట్టాడు. గురువారం చుట్టుప్రక్కల వారికి బాలయ్య ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ శివరామయ్య సీఐ మహేందర్ రెడ్డి సిబ్బందితో ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో ఫ్రిజలో ఉన్న శవాన్ని చూసి షాక్ తిన్నారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు పోలీసులు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపో వడంతోనే మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టినట్టు నిఖిల్ స్థానికులు, పోలీసులకు వివరించాడు.
గుట్టపై నుంచి భార్యను నెట్టేసిన భర్త!
వనపర్తి: selfie దిగుదామని కొత్తగా పెళ్లి అయిన ఓ భర్త తన భార్యను గుట్టపైకి తీసుకెళ్లాడు. సెల్ఫీ దిగుతుండగా భార్యను అక్కడ నుంచి తోసేసి హతమార్చాడు. ఈ సంఘటన వనపర్తి జిల్లా తిరుమలయ్యగుట్టపై చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల జిల్లా అలంపూర్ నియోజక వర్గంలోని జిల్లెల్ల పాడుకు చెందిన సరోజమ్మ, మద్దిలేటి దంపతులు 18 నెలల కిందట అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురానికి బతుకుదెరువు కోసం వచ్చారు. వారి కుమార్తె అయిన శరణ్య అలియాస్ గీతాంజలిని గట్టు మండలం చిన్నోని పల్లెకు చెందిన జయరాం గౌడ్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిపించారు.
ఈ క్రమం లో గత బుధవారం సెల్ఫీ దిగుదామని చెప్పి ఎత్తైన ప్రదేశానికి భార్యను తీసుకెళ్లి జయరాం గౌడ్ తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చిన జయరాం గౌడ్ తన భార్య కనబడటం లేదని గురువారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయిజలోని సీసీ పుటేజీలను పరిశీలించారు పోలీసులు. జయరాం కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని గట్టిగా నిలదీశారు. దీంతో తన భార్యను తానే హత్య చేసినట్టు అంగీకరించాడని తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకొని గురువారం సాయంత్రం సంఘటన స్థలం వనపర్తి జిల్లా తిరుమలయ్య గుట్టకు వచ్చి మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!