Cricket Betting Gang | తిరుపతిలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు సాంకేతికత ఆధారంగా చెన్నూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్‌పై దాడులు నిర్వహించారు. ఇద్దరు నిర్వాహకులు, ముగ్గరు బుకీలను అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు నిర్వాహకులు చెన్నూరుకుచెందిన వారు, కాగా ఒకరు మధిర నవశేఖర, ఇతనిపై గూడురు రూరల్ పోలీసు స్టేషన్లో రౌడీ షీటర్ ఉంది. ఇతని సోదరుడు మధిర ఉమా మహేశ్వర్‌గా గుర్తించారు. బెట్టింగ్ ఆడే ముగ్గురూ పి. వెంకట సుధీర్, పి. వెంకట రమణయ్య, వి.అశోక్‌లుగా పోలీసులు గుర్తించారు.
Cricket Betting Gang | బెట్టింగ్ మాఫియా అరెస్టు
గూడూరు రూరల్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేర్ల సమావేశంలో రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సూచనలతో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపామన్నారు. చట్ట విరుద్ధమైన క్రికెట్ బెట్టింగ్, మత్తు పదార్థాలు వినియోగం, రవాణా, పేకాట, కోడి పందాలు, రౌడీ ఇజం లాంటి పనులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో గూడూరు మండలం చెన్నూరు గ్రామం కేంద్రంగా క్రికెట్ ఐపీఎల్ సీజన్లో యథేచ్ఛగా బెట్టింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను గూడూరు రూరల్ ఎస్సై వి.బ్రహ్మం నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారన్నారు.
ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు బుకీలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.5 లక్షల 92 వేల నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక టివి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో ఇద్దరు నిర్వాహకులు చెన్నూరుకుచెందిన వారు, కాగా ఒకరు మధిర నవశేఖర, ఇతనిపై గూడురు రూరల్ పోలీసు స్టేషన్లో రౌడీ షీటర్ ఉంది. ఇతని సోదరుడు మధిర ఉమా మహేశ్వర్‌గా గుర్తించామన్నారు. బెట్టింగ్ ఆడే ముగ్గురూ పి. వెంకట సుధీర్, పి. వెంకట రమణయ్య, వి.అశోక్‌లుగా గుర్తించామన్నారు.

సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్‌లకు పాల్పడవద్దని సీఐ శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. సమావేశంలో గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు, పోలీసు సిబ్బంది రాజు, వెంకటేశ్వర్లు, సురేష్, విష్ణు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!