Credit Card : ప్రస్తుత కాలంలో క్యాష్‌లెస్(cashless) వర్కింగ్ స్టైలే నడుస్తుంది. అందులో భాగంగా మనలో చాలా మందికి క్రెడిట్ కార్డు(Credit Card)ను ఉపయోగించాలని ఆశ ఉంటుంది. ప్రతి షాపులోకి అడుగు పెట్టగానే ఇప్పుడు కొత్తగా క్రెడిట్ కార్డును ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. ఇక ఆన్లైన్ షాపింగ్ (online shopping)కంపెనీలు అయితే క్రెడిట్ కార్డు ఉన్నవారికి ప్రతి రోజూ ప్రత్యేక ఆఫర్లను మెస్సెజ్‌ల రూపంలో, ఈమెయిళ్ల రూపంలో పంపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడుతున్నవారు, ఒక వేళ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు 100లో 70 శాతం మంది ఉన్నారు. కానీ క్రెడిట్ కార్డు యమ డేంజర్ అంటున్నారు నిపుణులు. అది కొసరు కొసరుగా వాడితేనే డేంజర్ నుంచి తప్పించుకోగలుతామని చెబుతున్నారు.
Credit Card : అసలు క్రెడిట్ కార్డు అంటే డేంజర్ అని ఎందుకంటున్నానంటే? మనలో చాలా మంది క్రెడిట్ కార్డును తీసుకుంటారు. కానీ దానిని ఏ పద్ధతిలో వాడాలో బహుశా తెలియకపోవచ్చు. క్రెడిట్ కంపెనీ ఎంత లిమిట్(limit) ఇస్తే అంత వాడేసుకుంటున్నారు. ఆ తర్వాత వాడుకున్న మొత్తంపై అధిక వడ్డీ(interest rate) మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. అప్పటి నుంచి క్రెడిట్ కార్డు నుంచి ఫోన్లు, మెస్సేజ్‌లు వస్తూనే ఉంటాయి. ఈ విధంగా క్రెడిట్ కార్డుతో అసలు, మొత్తం చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతారు.క్రెడిట్ కార్డు మీ వద్ద ఉన్నప్పటికీ దానిని సరిగ్గా వాడకపోవడంం తెలియపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలు క్రెడిట్ కార్డు వాడటం తెలిస్తే చాలా సులభం. కాబట్టి కొత్తగా కార్డు కోసం అప్లై చేసుకునేవారు, ప్రస్తుతం వాడుతున్న వారి కోసం కొన్ని పద్ధతులను క్రింద తెలియజేస్తున్నాం.


Maintain Strict Budget
క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత ముందుగానే మన బట్జెట్ ఎంతో ఫిక్స్ చేసుకోవాలి. ప్రస్తుతం క్రెడిట్ కార్డు కంపెనీలు ఒక్కొక్కరి కార్డుపై రూ.1,00,000, రూ.50,000 అలా ఇస్తున్నారు. అయితే అలా ఇచ్చారు కదా, అని మొత్తం వాడేయ కూడదు. దానిలో 30% మాత్రమే అంటే రూ.30 వేలు మాత్రమే వాడుకోవాలి. అది కూడా ఏ షాపింగులకో, సినిమాలకో, పార్టీలకో ఉపయోగించకూడదు. కుటుంబానికి సంబంధించిన నెలవారి బిల్లులు, ట్యాక్సీల కోసం మాత్రమే వాడుకోవాలి. కానీ రూ.30,000 వేలు వాడుకుందామనుకుని రూ.70 వేలు వాడేస్తే చాలా ప్రమాదంలో పడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడనుకుందాం. అతనికి నెలకు రూ.15,000 జీతం. అయితే ఆ జీతంలో ఈ క్రెడిట్ కార్డు ఆన్లైన్ ఖర్చులకు రూ.7,000 వేలు ఖర్చు చేస్తే ఇక ఆ వ్యక్తి కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు, పిల్లల ఫీజులు ఎలా కడతాడు. అప్పుడప్పుడు వచ్చీపోయే రోగాలను ఏం చూసుకుంటాడు. కాబట్టి క్రెడిట్ కార్డు విషయంలో రూ.30,000 వేలు అనుకుంటే నెలలో అంత వరకే ఖర్చు చేయాలి.
Do Not Spend More Than Credit Limit
క్రెడిట్ కార్డు కంపెనీలు మనకు ఇచ్చిన లిమిట్‌ను ఎప్పుడూ క్రాస్ చేయకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. కొంత మందికి నెలకు రూ.1 లక్ష క్రెడిట్ కార్డు మీద వాడేందుకు ఉన్నాయనుకోండి. వారు లక్ష దాటి రూ.30 వేలు అంటే ఒక నెలలో రూ.1 లక్షా 30,000 వేలు వాడారు. అప్పుడు క్రెడిట్ కార్డు కంపెనీ పైన వాడిన రూ.30,000 వేలపై ఎంత వడ్డీ వేస్తుందో మనకు తెలియదు. అలా వడ్డీ పెరుగుతుంది. నెలనెలా కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. ఈ విధంగా ఆ కంపెనీ, అలాంటి వారిని చూసి క్రెడిట్ అంగ్రీ పర్సన్‌గా ముద్ర వేస్తుంది. మనకు ఇచ్చిన లిమిట్‌పై 30% శాతానికి మించి ఎప్పుడూ వాడరాదు. ఇలా వాడారో మన క్రెడిట్ స్కోర్ బీభత్సంగా డౌన్ అయిపోతుంది. ఇలా ప్రతినెలా క్రెడిట్ కార్డును ఇబ్బడిముబ్బడిగా వాడిపడేస్తే వడ్డీ పెరుగుతుంది. స్కోరూ తగ్గుతుంది.


Pay Your Dues On Time and Fully
మనం క్రెడిట్ కార్డు బిల్ ఖచ్చితంగా ఆన్టైంలో చెల్లించాలి. లేకుంటే మన సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతుంది. ఉదాహరణకు ఒక నెలలో రూ.1,00,000 ఖర్చు చేశామనుకోండి. దాని బిల్లు వచ్చే నెలలో వస్తుంది. ఆ బిల్లు వచ్చిన తర్వాత దానిని క్రెడిట్ కార్డు కంపెనీ వారు 15 రోజుల నుంచి 20 రోజుల్లో చెల్లించాలని గడువు పెడతారు. ఇక చెల్లించే విధానం రెండు పద్ధతుల్లో ఉంటుంది. 1.అవుట్ స్టాండ్ పే 2. మినిమం అమౌంట్ పే ఇలా రెండు పద్ధతులు ఉంటాయి. చాలా మంది ఈ రెండు పద్ధతుల్లోనే బాగా దెబ్బ తింటారు. రూ.లక్ష రూపాయలు బిల్లు వస్తే అది అవుట్ స్టాండ్ పేలో ఒకేసారి చెల్లించాలి. కానీ ఇంత అమౌంట్ ఎవరు చెల్లిస్తారులే నని, మినిమం అమౌంట్ పే ఎంచు కుంటారు. ఇందులో నెలకు వడ్డీ రూపంలో క్రెడిట్ కంపెనీకి చెల్లిస్తారు. ఇలా చెల్లిస్తున్న సమయంలో ఎప్పుడో ఒకసారి ఆ రూ.లక్ష రద్దు అవుతుందిలే అనుకుంటారు. కానీ ఇక్కడే పప్పులో కాలేసినట్టు లెక్క. ఒక వ్యక్తికి నెలకు రూ.1 లక్షకు వడ్డీ చెల్లిస్తున్నాడనుకోండి, అతడు కేవలం లక్షలకు 3% శాతం నుంచి 5% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే అతను 4% శాతం వడ్డీ చెల్లిస్తే నెలకు రూ.4,000 కడుతున్నట్టు లెక్క. ఇది చాలా తప్పు. కాబట్టి ఒకేసారి చెల్లింపు పద్ధతినే ఎంచుకోవాలి. కొంత మంది నెల చివరిలో లాస్ట్ తేదీలో మొత్తం బిల్లును చెల్లిస్తారు. అలాంటి వారు బ్యాంక్ అకౌంట్‌కో, సేవింగ్ అకౌంట్‌కో అటాచ్ చేస్తారు. ఆటోమెటిక్‌గా క్రెడిట్ కార్డుకు ఆ తేదీలోపు చెల్లింపు జరుగుతుంది. ఇది మంది పద్దతి. దీని వల్ల వడ్డీ తగ్గుతుంది. స్కోరూ దెబ్బతినదు.


Don’t Use Credit Card in ATM’S
ఈ మధ్య కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డు కస్టమర్లు ఏటిఎం(ATM) వద్దకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. అలా చేయడం మరీ డేంజర్లో పడినట్టు లెక్క. ఎందుకంటే క్రెడిట్ కార్డును సాధారణంగా స్వైప్ చేయడానికో, ఆన్లైన్లో బిల్లులు చెల్లించడానికో ఉపయోగిస్తారు. కానీ ఏటిఎంలో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసిన సమయంలో పెనాల్టీ పడుతుంది. అది ఎంతలా అంటే ఒక వ్యక్తి రూ.10,000 విత్‌డ్రా చేస్తే దాదాపు రూ.500 నుంచి రూ.600 వరకు ఛార్జి పడుతుంది. ఇలా క్రెడిట్ కార్డు ట్రాప్‌లో పడుతుందన్నమాట. ఇది మంచి పద్దతి కాదు.


Keep Your Card Secure
చివరకు మన క్రెడిట్ కార్డును చాలా సేఫ్‌గా భద్ర పర్చుకోవాలి. కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్(google play store)కు క్రెడిట్ కార్డు అకౌంట్‌ను లింక్ చేస్తుంటాం. అలా చేసిన సమయంలో మన పిల్లలు ఏదైనా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి గేమ్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటారు. కొన్ని గేమ్స్ ఫ్రీగా ఉంటే మరికొన్ని గేమ్స్(games)కు ఖచ్చితంగా పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. పిల్లలు తెలియక ఆ పేమెంట్ ఆఫ్షన్ నొక్కినప్పుడు ఆటోమెటిక్‌గా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వెళ్లిపోతాయి. ఇటీవల పిల్లలు పబ్జీ గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని లక్షల్లో డబ్బలు ఖర్చు చేసినట్టు మనం వార్తలో వినే వుంటాం. కాబట్టి క్రెడిట్ కార్డును ఎట్టి పరిస్థితుల్లో ప్లే స్టోర్‌కు లింక్ కాకుండా చూసుకోవాలి. కొన్ని సార్లు మన క్రెడిట్ కార్డు అనుకోకుండా చేజారి పోతుంది. ఆ సమయంలో వెంటనే మీ బ్యాంకు(bank) ఖాతా ఉన్న బ్రాంచ్‌కు ఫోన్ చేసి క్రెడిట్ కార్డును వెంటనే బ్లాక్ చేయమని చెప్పాలి. లేకుంటే అది దొరికిన వారు ఆ క్రెడిట్ కార్డులో ఉన్న మొత్తం నగదును కాజేస్తారు. మొత్తంగా క్రెడిట్ కార్డు గురించి మాకు తెలిసిన సమాచారం మీకు అందించాం. ఇక మీరు ఇప్పటికైనా జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా వాడుకోగలరని ఆశిస్తున్నాం.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started