Crab Cutting skills | మీరు కోళ్ళను కట్ చేయడం చూసుంటారు. చేపలను కట్ చేయడం చూసి ఉంటారు. కానీ ఇక్కడ బ్రతికి ఉన్న పీతను ఎలా కట్ చేశాడో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మనం తినే ప్రతి ఆహారం చాకుతో కట్ చేసుకొనే తింటుంటాం. ఇక మాంసం విషయానికి వస్తే చేపలు, కోళ్ళు, పొటేళ్లు ఇంకా అంత కన్న పెద్ద జంతువులను కట్ చేయాలంటే ఆ మనిషికి స్కిల్స్ తప్పకుండా ఉండాలి మరి. అందరికీ మాంసం కట్ చేయడం రాదు. కొందరు మాత్రమే అందులో నైపుణ్యం కలిగి ఉంటారు.
Crab Cutting skills
ఇక్కడ బ్రతికి ఉన్న పీతను ఒక మాంసం కొట్టు దుకాణంలో ఓ వ్యక్తి తనదైన శైలిలో కట్‌చేసి వీడియో(Crab Cutting Video) రూపంలో పెట్టాడు. ఆయన దానికి కట్ చేయకముందు అది పాపం బ్రతికేందుకు శతవిధాలా పారిపోదామని ప్రయత్నిస్తుంది. కానీ అతను మాత్రం కత్తిని పీత మెడ మీద పెట్టి ముందు రెండు పెద్ద చేతులను కట్ చేశారు. దీంతో అది ఎటూ కదలలేక పోయింది. ఆ తర్వాత ఆరు కాళ్ళను చివరన కట్ చేశాడు. తర్వాత పీతను రెండు చిప్పలను వలిచాడు. ఇలా వలిచిన తర్వాత ముక్కలు ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో సజీవంగా ఉన్న పీతను కట్( A live Crab Cutting) చేస్తున్నాడు అని యూట్యూబ్‌లో ఉంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ముక్కలు ముక్కలు కట్ చేసే వరకూ పీత బ్రతికే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఇతర జంతువుల పట్ల మానువుడు ఇంత క్రూరంగా ప్రవర్తించడం భయాందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా పీతలను నరికి పీత పెంకులోని తెల్లని నీరు వీధిలో పడితే వీధి అంతా పీత వాసనే వస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ పీతను నరకడం వీడియో తమిళనాడు రాష్ట్రంకు సంబంధించినది అని తెలుస్తోంది.
ఈ వీడియో చూడాలంటే లింక్‌ను క్లిక్ చేయండి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!