cpm party

cpm party: హుజూరాబాద్ ఎన్నిక‌లో ఆ రెండు పార్టీలు 1500 కోట్లు ఖ‌ర్చు ?

Spread the love
  • ఒక్క గింజ కూడ కొనుగోలు చేయాని ప్రభుత్వం
  • 9న గ్రామ స్థాయిలో ఆందోళనలు
  • 12న ఖమ్మంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
  • సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

cpm party ఖ‌మ్మం: రైతులు పండించిన వరిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. బుధ‌వారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరి పండించవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని.. వరి ధాన్యం పండించవద్దు అని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వరి పండించవద్దని రాష్ట్రాలకు సర్కులర్ జారీ చేశారని, ఆ విషయం తెలియకుండానే బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండీ సంజయ్ దీక్షలకు దిగడం విషయం తెలుసుకొని దీక్షలు విరమించుకున్నారని ఆరోపించారు. దీనిని ఆధారంగా తీసుకొని సంగారెడ్డి కలెక్టర్ రబీలో వరి విత్తనాలు అమ్మకాలు చేయవద్దని, అలా చేస్తే లైసెన్స్లు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరింపుల‌కు పాల్పడుతున్నారని అన్నారు. బిజెపి మాత్రం ఉప్పుడు బియ్యం పండించవద్దు అన్నాం తప్ప మిగతావాటిపై ఆంక్షలు పెట్టలేదని అంటున్నారని (cpm party)అన్నారు.

ఈ ఆంక్షలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం పెడుతుందా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా వరి పంటలు పండిస్తారని,గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా 75 శాతం కొనుగోలు చేసేదని దానిని క్రమేపీ 50 శాతం నుంచి 25 శాతానికి ప్రస్తుతం అసలు కొనుగోలుని నిలిపివేసేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. గోదాంలో ఉన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలును బంద్ చేసి రైతులను పంటలు వేయకుండా ఆపేందుకు కలెక్టర్లు సైతం డీలర్ను వత్తిడి తీసుకొస్తున్నారని, దీనితో రైతులు ఆందోళల చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. పండించిన పంటకు కనీసం మద్దతు ధర నిర్ణయించకపోవడంతో రైతులు ఆందోళణ పడుతున్నారని అన్నారు. దేశంలో ఇటీవల 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పనికి రాకుండా పోవడంతో పారబోసేరని, వాటికి పేదలకు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. వరి ఇతర ఆహార పంటలు వేయోద్దని ప్రభుత్వం చెప్తుందని, రాబోయే కాలంలో ధాన్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు రైతు వద్ద నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్తూ ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ఇలాగే జరిగితే అధికార పార్టీ ప్రతినిధులు ఇంటి ఎదుట కూర్చుని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఆందోళ‌న‌లు చేస్తాం!

దీనిలో భాగంగానే ఈ నెల 9వ తేదీన గ్రామ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని, ఈ నెల 12న జిల్లా కేంద్రంలో రైతులను ఐక్యం చేసి ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధిక వర్షాలకు పంటలు దెబ్బ తింటే అంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదని గత ప్రభుత్వాలు నష్టబోయిన రైతులను ఎంతోకొంత ఆదుకున్నాయని, ఈ ప్రభుత్వం ఆ ఊసే లేదన్నారు. ఇప్పటికే జిల్లాలోని 18 మండలాలలో పత్తి, మిర్చి దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు బ్యాంకుల వ‌ద్ద రుణాలు తీసుకునేటప్పుడు భీమా కింద డబ్బులు వసూలు చేస్తున్నప్పటికి ఒక్క రైతు కూడా ప్రయోజనం జరుగలేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజేపి రెండు పార్టీలు కలిపి ఉప ఎన్నికల్లో 15 వందల కోట్లు ఖర్చు చేశాయని అన్నారు. హుజూరాబాద్లో ప్రజాస్వామ్యం కూనీ అయ్యిందని, ఇప్పటికైన ఈ ఓటమితో కెసిఆర్ వైఖరి మార్చుకొని రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని అన్నారు. హుజూరాబాద్ లో బిజేపికి ప్రజల సానుభూతి లేదని ఈటెల రాజేందర్, కేసిఆర్ మధ్య పోటీ జరిగిందని అన్నారు.. సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతు వేదికలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ఆరోపించారు. రైతు వేదికల ముఖ్య ఉద్దేశం రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఏ నేలలో ఏ పంటలు వేయాలి అనే వివ‌రాలు తెల‌ప‌డానికి అని, కానీ అవేమీ జ‌ర‌గ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వేదికను రైతులకు ఉపయోగపడేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్రకమిటి సభ్యులు ఎర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

double bedroom: గోడలపై బొమ్మల కాదు..గోడలు వున్న ఇళ్లు ఇవ్వండి: విక్ర‌మ్‌

double bedroom: ఖమ్మం: నియోజకవర్గంలో అర్హులు అయిన అందరికీ డబుల్ బెడ్ రూం (double bedroom)ఇళ్లు ఇవ్వాలని లేనియెడల ప్రజలు TRS ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేస్తారని Read more

khammam bus depot road: విచార‌ణ జ‌రిపించాలంటున్న సిపిఎం

khammam bus depot road: బ‌స్ డిపో రోడ్డులో జ‌రిగే డ్రైనేజీ ప‌నుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని విచార‌ణ జ‌రిపించాల‌ని సిపిఎం జిల్లా నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. ఈ Read more

khammam Municipal Election 2021: ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇక ప్ర‌చారానికి రెఢీ!

khammam Municipal Election 2021: ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇక ప్ర‌చారానికి రెఢీ! khammam Municipal Election 2021: ఖ‌మ్మం న‌గ‌ర‌ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల జాత‌ర Read more

Forest Officer Attacked : ఆ ఫారెస్టు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు Forest Officer Attacked : నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 2 గ్రామాల నుండి 3 రోజుల Read more

Leave a Comment

Your email address will not be published.