khammam bus depot road: బస్ డిపో రోడ్డులో జరిగే డ్రైనేజీ పనుల్లో అవకతవకలు జరిగాయని విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ పనులను సందర్శించారు.
khammam bus depot road : ఖమ్మం: ఖమ్మం నగరంలోని బస్సు డిపో రోడ్డు ఆక్రమణలపై, నాసిరకం డ్రైనేజీ అవకతవకలపై కలెక్టర్ విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా నేతలు శ్రీకాంత్, వై.విక్రమ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్తో కలిసి టూ టౌన్ బృందం బస్సు డిపో రోడ్డు డ్రైనేజీ నాసిరకం పనులను పరిశీలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగరంలోని బస్సు డిపో రోడ్డు పై ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో 60 అడుగుల రోడ్డు విస్తర్ణ చేయాలని ప్రజలు అనేక ఆందోళనలు చేశారని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు 50 అడుగులకు కుదించారన్నారు.


ఈ కుదింపు కూడా మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ స్థానిక నాయకులు ఇష్టారాజ్యంగా రోడ్డు వెడల్పు చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఆ రోడ్డు లో నేతల బిల్డింగ్ లు ఉన్న చోట రోడ్డు వెడల్పు పెడుతున్నారని ఆరోపించారు. రోడ్డు డ్రైనేజీ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మరో వైపు రోడ్డు వెడల్పు చేయకుండానే డివైడర్ లు ఏర్పాటు చేయడంతో మరింత ట్రాఫిక్ జామ్ అవుతోందని పేర్కొన్నారు. తక్షణమే డిపో రోడ్డు అవకతవలకపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని యెడల స్థానిక ప్రజలను సమీకరించి ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!