CPIM KHAMMAM

CPIM KHAMMAM : రాజ‌కీయాల‌కు అతీతంగా జ‌ర‌గాలి

తెలంగాణ‌

ఖ‌మ్మం కార్పొరేష‌న్ డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న‌పై సిపిఐ(ఎం) డిమాండ్

CPIM KHAMMAM : Khammam: ఖ‌మ్మం కార్పొరేష‌న్ డివిజ‌న్లు పున‌ర్విభ‌జ‌న రాజ‌కీయాల‌కు అతీతంగా జ‌ర‌గాల‌ని, అలా జ‌ర‌గ‌క‌పోతే న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌ని సిపిఐ(ఎం)(CPIM) బృందం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు శ‌నివారం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యం అధికారి మల్లేశ్వ‌రికి వివిధ డివిజ‌న్లులో అశాస్త్రీయంగా జ‌రిగిన పున‌ర్విభ‌జ‌న వివ‌రాలు రాసి విన‌తిప‌త్రం ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ మాజీ ఛైర్మ‌న్ అఫ్రోజ్ స‌మీనా మాట్లాడుతూ అశాస్త్రీయంగా, పున‌ర్విభ‌జ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా రాజ‌కీయా క‌క్ష‌లు దృష్టిలో ఉంచుకొని పున‌ర్విభ‌జ‌న చేశార‌ని విమ‌ర్శించారు. ఒక డివిజ‌న్ ఓట్ల‌కు మ‌రో డివిజ‌న్ ఓట్ల‌కు మ‌ధ్య 2300 ఓట్లు తేడా ఉంద‌ని ఆరోపించారు. రాష్ట్రీయ ర‌హ‌దారి ప‌రిధి, పోలింగ్ బూతుల ప‌రిధి, రెవెన్యూ ప‌రిధి, స్టేష‌న్ ప‌రిధి, స‌రిహ‌ద్దుల ప‌రిధి ఇలా చాలా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అశాస్త్రీయంగా నూత‌న 40వ డివిజ‌న్ ఉంద‌ని ఆమె పేర్కొన్నారు.

న‌గ‌రంలోని మెజార్టీ డివిజ‌న్లు శాస్త్రీయ‌తో కూడిన పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌లేద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను దృష్టిలో ఉంచుకుని పుర్విభ‌జ‌న జ‌రిగే వ‌ర‌కు త‌మ పోరాటం ఉంటుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వై. శ్రీ‌నివాస‌రావు, వై. విక్ర‌మ్‌, జ‌బ్బార్‌, టి. లింగ‌య్య‌, నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *