CPIM Khammam: జాతి పిత మహాత్మా గాంధీ మతసామరస్య స్పూర్తి కొనసాగిస్తూ, మతోన్మాద శక్తులు, గాడ్సే వారసులైన బిజెపి పాలకులను గద్దె దింపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. స్థానిక గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు తుశాకుల లింగయ్య అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ జాతీయోద్యమ స్ఫూర్తి కి విరుద్ధంగా నేడు దేశంలో లో మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి కి తూట్లు (CPIM Khammam) పొడుస్తున్నారు.

ఈ పరిస్థితి నుండి దేశాన్ని కాపాడుకోవాలంటే గాంధీ కలలు కన్న స్వతంత్ర భారతాన్ని సాధించాలన్నా మతతత్వ బిజెపి పార్టీని ఓడించడమే ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్ మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత లకు విఘాతం కలిగించే చర్యలు, మత కల్లోలాలను రెచ్చగొట్టే చర్యలు బిజెపిచాలా తీవ్రంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మట్టపల్లి వెంకన్న, కోడి వెంకన్న, శ్రీశైలం, కృష్ణ, వెంకట నారాయణ, సాయిలు, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ