CP CV Anand హైదరాబాద్: రాబోయే రోజుల్లో డ్రగ్స్(Drugs) అతిపెద్ద సమస్యగా మారుబోతోంది. స్కూల్స్, కాలేజీల్లోనే డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకపోతే పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడే అవకాశం ఉందంటూ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) చేసిన వ్యాఖ్యలు గుండెల్లో గుబులు పుట్టిస్తన్నాయి. స్కూళ్లు, కాలేజీలకు ఈజీగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ముఖ్యంగా ఇంర్నేషనల్ స్కూళ్లల్లో వాడుతున్నట్టు తమకు సమచారం ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సెకండ్ లెవల్ టౌన్లకు గంజాయి సరఫరా పెరిగిందన్న సీపీ తనకు తెలిసిన చాలా మంది పిల్లలు డ్రగ్స్‌కు బానిసయ్యారన్నారు.
ఇక డ్రగ్స్ తీసుకునేవారూ నిందితులే!
ఇప్పటి వరకు డీలర్లు, పెడ్లర్స్ఫైనే ఫోకస్ పెట్టిన పోలీసులు ఇప్పుడు రూట్ మార్చారు.సీఎం కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్‌పై ప్రత్యేక యాక్షన్ తీసుకుంటున్నారు. ఇటీవలే రెండు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు డ్రగ్స్ సప్లై చేసిన వాళ్లే నింది తులు..డ్రగ్స్ వాడే వాళ్లను మాత్రం బాధితులుగా పరిగణించే వాళ్లు. ఇకపై డ్రగ్స్ వాడేవాళ్లు కూడా నిందితులే. వాళ్లకు కూడా శిక్షలు పడతాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాబోయే రోజుల్లో మనల్ని రెండు అతిపెద్ద సమస్యలు వెంటాడబోతున్నాయి. అందులో ఒకటి నిరుద్యోగం. అయితే ఇంకొకటి డ్రగ్ సరఫరా అని సీపీ సీవీ ఆనంద్ అంటున్నారు. డ్రగ్స్‌పై ప్రజలను చైతన్య తీసుకు రావడమే కాకుండా మత్తు మాఫియా ఆటలు కట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని సీపీ ఆనంద్ పిలుపు నిచ్చారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!