
Covid Third Wave: Hyderabad: కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కేసులు ఎక్కువుగా నమోదు కాకపోవడంతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మళ్లీ కరోనా పంజా విప్పుతోంది. ఒక్కప్పుడు మహారాష్ట్రను గడగడలాడించిన మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్ర లో ప్రతి రోజూ 3,000 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తొలివారంతో పోలిస్తేనే 14 శాతం అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ముంబై, పూణే నగరాల్లో ప్రతిరోజూ 600 పై చిలుకు కేసులు నమోదువుతున్నాయి. అదేవిధంగా కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ఒక అపార్టమెంట్లో సోమవారం 28 కేసులు నమోదుయ్యాయి. మంగళవారం ఆ సంఖ్య 103కు పెరిగింది. మరోవైపు కేరళలోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేరళ నుంచి వచ్చేవారు తాజా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ (ఆర్టీపీసీఆర్)తో వస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తం!
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో మనకు సరిహద్దు ఎక్కువుగా ఉంది. కేరళలో విస్తృత సంబంధాలున్నాయి. అక్కడ ప్రాంతానికి చెందిన నర్సులు, టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంటారు. ఇక మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాలకు రోజువారీ రాకపోకలు కొనసాగుతుంటాయి. ఈ రాష్ట్రాలకు నిత్యం అనేక విమాన సర్వీసులు నడుస్తాయి. ఈ ప్రయాణాల ద్వారా అనేక వేలమంది వస్తూ పోతూ ఉంటారు. దీంతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
బయటపడ్డామనుకుంటున్న ప్రజలు!
రాష్ట్రంలో కరోనా కేసులు కొన్ని రోజుల వరకు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం రోజుకు సగటున 150 వరకు నమోదువుతున్నాయి. మరోవైపు కరోనాతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామన్న భావన ప్రజల్లో నెలకొంది. ఫలితంగా కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవరించిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మాస్కులు ధరించడం వృథా అన్న భావన నెలకొంది. భౌతిక దూరం కూడా అక్కడక్కడ పాటించడం లేదు. చేతులు శుభ్రం చేసుకోవడంలోనూ అశ్రద్ధ చేస్తున్నారు. పూర్తిగా తెరుచుకున్న హోటళ్లు, కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు ప్రారంభంలో కరోనా నిబంధనలు పాటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా ఆ నిబంధనలు పాటించడం లేదు. చాలా మంది సినిమా చూసేవారు మాస్కులు ధరించడం లేదు. శుభకార్యాలకు గణనీయమైన సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. దీంతో కరోనా చాపకింద నీరులా మళ్లీ విజృంభించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు.

వ్యాక్సిన్ పై అనాసక్తి!
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేసి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ కొంత మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. బ్రిటన్, అమెరికా, యూరప్ దేశాల్లో నైతే వ్యాక్సిన్ కోసం జనం ఎగబడుతున్నారు. కానీ తెలంగాణతో పాటు ఆంధ్రా లోనూ వ్యాక్సిన్ తీసుకోవడానికి లబ్ధిదారులు కొంత సంకోచిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందిలో 58 శాతం మంది మాత్రమే మొదటి డోస్ తీసుకున్నారు. ఇక పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్ వర్కర్లు అయితే కేవలం 33 శాతమే వ్యాక్సిన్ తీసుకున్నారు. చిన్నపాటి భయాలను దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండగా, మరికొందరైతే వైరస్ తగ్గుముఖం పట్టింది కదా! టీకా ఎందుకని తేలికగా తీసుకుంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్రస్థాయి కీలక అధికారులు, కొన్ని విభాగాల అధిపతులు కూడా వ్యాక్సిన్ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైరస్ లింక్‌ను వ్యాక్సిన్‌తో కట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే, ఇలా టీకా తీసుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ తిరగబడే పరిస్థితి ఏర్పడనుంది.
ఇది చదవండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు
ఇది చదవండి:దేశంలోనే తొలిసారి మహిళకు ఉరిశిక్ష
ఇది చదవండి: వారికి మరో అవకాశం ఇచ్చిన ఎస్ఈసీ
ఇది చదవండి:కొత్త స్ట్రెయిన్లతో ముప్పు..అప్రమత్తమైన కేంద్రం
ఇది చదవండి:హత్యలు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఇది చదవండి:మనిషి మాంసం తినే తెగ గురించి తెలుసా?
ఇది చదవండి:జీతాల్లేవు..భద్రత లేదు!
ఇది చదవండి:తెలంగాణ కోడలను నేను.. విమర్శకులకు షర్మిలా సమాధానం!
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య