Covid Second wave : దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించినప్పటికీ కేసులు ఏ మాత్రమూ తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం మరో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Covid Second wave : ఢిల్లీ, మధ్య ప్రదేశ్ లో కరోనా రోజువారీ కేసుల్లో కాస్త స్థిరత్వం వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అస్సోం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో తాజాగా కేసులు ఎగబాకుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ రాష్ట్రాలన్నీ అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని ప్రస్తుతం అవే ఆందోళన కలిగిస్తున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 % శాతానికి పైగా ఉందని వెల్లడించారు. ఇక కరోనా ఉధృతి ఆందోళనకరంగా ఉన్న మహారాష్ట్రలో 12 జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీల విషయంలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఆదివారం 78 శాతం ఉన్న రివకరీ రేటు నేడు 82 శాతానికి పెరిగిందని తెలిపారు. 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైందని అగర్వాల్ తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గల 20 లక్షల మందికి టీకాలు అందాయని వెల్లడించారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నామన్నారు.


కొంపముంచిన కుంభమేళా(Kumba Mela)!
మధ్యప్రదేశ్ : హరిద్వార్‌లో కుంభమేళ(Kumba Mela)లో పాల్గొని మధ్యప్రదేశ్‌కు తిరిగి వచ్చిన వారిలో 99 శాతం మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్థారణ కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేల ఈ పరిణామం అధికారులను కలవరం కలిగిస్తోంది. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా కోవిడ్ సూపర్ స్ప్రెడర్ అనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇందులో పాల్గొని వచ్చిన 61 మంది యాత్రికులకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభమేళాలో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో మరికొందరిని ఇంకా గుర్తించకపోవడంతో వారి ద్వారా వైరస్ సంక్రమణప ఆందోళన వ్యక్తమవుతుంది. కుంభమేళా నుంచి వచ్చిన వారు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని రాష్ట్రాలకు అధికారులు సూచించారు.


ఆదివారం 3.68 లక్షల మందికి కరోనా!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 3.68 లక్షల మంది వైరస్ బారిన పడినట్టు నిర్థారణ అయ్యింది. కోవిడ్ కారణంగా మరో 3,417 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర స్థాయిలో కొత్తగా 3,68,147 కేసులు వెలుగు చూశాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 3,417 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం కేసులు 1,99,25,604 ఉండగా, మరణాలు 2,18,959, కోలుకున్న వారు 1,62,93,003, యాక్టివ్ కేసులు 34,13,642 కేసులు ఉన్నాయి. కోవిడ్ సోకిన వారిలో 3,00,732 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 81.77 శాతానికి పడిపోగా, మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 15.71 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం