Bengaluru Covid cases : స్మశానాలతో ఫుల్ అయిన బెంగళూరు
Bengaluru Covid cases : బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కోవిడ్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. స్మశానాల వద్ద మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నాయి. బెంగళూరులో కరోనా వైరస్ సోకి నిత్యం 50 మంది వరకూ చనిపోతున్నారు. ఇక నగరంలోని ఉన్న 5 స్మశాన వాటికల్లో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు.


ప్రతి రోజూ కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. శ్మశాన వాటిక వద్ద ఒక్కో అంబులెన్సు అంత్యక్రియల కోసం నాలుగైదు గంటలు క్యూలలో ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. బెంగళూరులో జాలహళ్లి వద్ద ఉన్న సుమనహళ్లి, కెంగేరి, బొమ్మనహళ్లి, పెనత్తూరు శ్మశాన వాటికల్లో కోవిడ్ సోకి మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అంత్యక్రియలు చేసే సిబ్బందికి అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క బెంగళూరులోనే 10,000 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14,738 మందికి పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. 3,591 మంది కోలుకున్నారు. రికార్డు స్థాయిలో 66 మంది కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,09,650 కు పెరిగింది. అందులో 9,99,958 మంది కోలుకున్నారు. మరణాలు 13,112 కి పెరిగాయి. ప్రస్తుతం 96,561 మంది చికిత్స పొందుతుండగా అందులో 555 మంది ఐసీయూలో ఉన్నారు.


సీఎంకి రెండో సారి కరోనా పాజిటివ్
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మళ్లీ కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో సీఎంకు పాజిటివ్‌గా నిర్ణారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పాజిటివ్ వచ్చిందని, స్వల్పంగా జ్వరం ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు గత శుక్రవారం ఆసుపత్రిలో చేరానన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బెంగళూరులో రామయ్య ఆసుపత్రిలో చేరిన సీఎంకు పాజిటివ్ రావడంతో మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం