Tiruvuru పోలీస్‌స్టేష‌న్‌లో జాగ్ర‌త్త‌లు సూచించిన CI

0
13
views

Tiruvuru పోలీస్‌స్టేష‌న్‌లో జాగ్ర‌త్త‌లు సూచించిన CI

Tiruvuru : క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పోలీసు సిబ్బంది జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స‌ర్కిల్ ఇన్ప్సెక్ట‌ర్ ఎం.శేఖ‌ర్ బాబు తెలిపారు. తిరువూరు పోలీసు స్టేష‌న్లో సిబ్బందికి క‌రోనా 2.0 ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని సూచించారు. ప్ర‌జ‌ల్లో క‌రోనా ప‌ట్ల ఇప్ప‌టికే అనేక‌సార్లు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై చ‌లానాలు విధించాల‌ని సూచించారు. క‌రోనా నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటేనే ఉద్యోగం ప‌ట్ల బాధ్య‌త క‌న‌బ‌రుస్తూ కుటుంబాన్ని క‌రోనా నుండి సంర‌క్షించుకోవ‌డం మ‌న అంద‌రి బాధ్య‌త అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌బ్ ఇస్స్పెక్ట‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం పోలీసు సిబ్బంది, మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శులు ఉన్నారు.

స‌ర్పంచ్‌ల‌కు అవ‌గాహ‌న‌!

కోవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై తిరువూరు మండ‌లంలోని నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచులు, వార్డు మెంబ‌ర్ల‌కు పంచాయ‌తీరాజ్ శాఖ క‌మిష‌న‌ర్ జూమ్ యాప్ ద్వారా నిర్వ‌హించిన శిక్ష‌ణా త‌ర‌గ‌తిలో ఎంపీడీఓ బీవీరావు మాట్లాడారు. కార్య‌క్ర‌మంలో స‌ర్ప‌చ్‌లు, వార్డు స‌భ్యులు పాల్గొన్నారు.

తిరువూరు మండ‌లం వార్త‌లు

తిరువూరు మండ‌లంలోని చౌటుప‌ల్లి, రాజుగూడెం పీహెచ్‌సీలు తిరువూరు ఏరియా హాస్పిట‌ల్ నందు రెండో డోసు కొన‌సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో త‌హ‌శీల్దార్ స్వ‌ర్గం న‌ర‌సింహారావు, డా.గంగాధ‌ర్ కుమార్ పాల్గొన్నారు.

తిరువూరు మండ‌లంలోని రోలుప‌డిలో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తి ఇంటికి వెళ్లి 21 రోజులు హోం క్వారంటైన్ నోటీసును వాలంటీర్లు ఇచ్చారు. 5 రోజుల‌కు మందులు అందించి వారి సందేహాల‌ను నివృత్తి చేశారు.

Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here