Education Minister : ఆ విద్యాసంస్థలను మూసివేయండి
కరోనా కేసుల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి వెల్లడి
Education Minister : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులు నమోదైన విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థల్లో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకాడమిక్ క్యాలెండర్ గాడిలో పెట్టామని చెప్పారు. పెద్ద ఎత్తున కరోనా సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందన్నారు. దేశంలోని అత్యధిక కరోనా టెస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేశామని పేర్కొన్నారు. కరోనా మళ్లీ పుంజుకుంటోందని, రెండు నెలలు జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని, కరోనా సోకిన వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని, ఆదివారాలు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!