Core Web Vitals Assessment: covid 3rd wave : షాకింగ్ : క‌రోనా థ‌ర్డ్ వేవ్ రెడీగా ఉందంట‌!

covid 3rd wave : షాకింగ్ : క‌రోనా థ‌ర్డ్ వేవ్ రెడీగా ఉందంట‌!

covid 3rd wave : ప్ర‌పంచ దేశాలు ప్ర‌శాంతంగా ఉన్నా భార‌త్‌ను మాత్రం క‌రోనా ప్ర‌శాంతంగా బ‌త‌క‌నిచ్చేట‌ట్టు లేన్న‌ట్టుంది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి రూపాంత‌రం చెందుతూ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీస్తోంది.


covid 3rd wave : న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌భావం చూపిస్తున్న దెబ్బ‌కు ప్ర‌జ‌లు విల‌విల్లాడుతున్నారు. అయితే గ‌త కొద్ది వారాలుగా ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకుంటున్న నేప‌థ్యంలో ముక్కులో క‌రోనా బ్ర‌తికే ఉంద‌న్న చందంగా మూడో ముప్పు అదే థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌ద‌ని ఆరోగ్య వైద్య నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. ఈ థ‌ర్డ్‌వేవ్ కూడా వ‌చ్చే నెల ఆగ‌ష్టు 2021 నుండి ప్ర‌భావం ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని SBI నివేదిక హెచ్చ‌రించింది. సెప్టెంబ‌ర్ నెల‌లో ఇది కాస్త గ‌రిష్ట స్థాయికి చేరుకోవ‌చ్చ‌ని ఆ బ్యాంక్ అంచ‌నా వేసింది. దేశంలో ఆర్థిక రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపి ప్ర‌జ‌ల‌కు ఉపాధి లేకుండా చేసిన క‌రోనా ప్ర‌భావంపై భార‌తీయ స్టేట్ బ్యాంక్ నిపుణుల బృందం ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తోంద‌ట‌.

ఇందులో భాగంగా covid 19 : the race to finishing line పేరుతో తాజాగా ప‌రిశోధ‌నాత్మ‌క నివేదిక‌ను విడుద‌ల చేసింది. దేశంలో కోవిడ్ వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంద‌ని అభిప్రాయ‌ ప‌డిన నివేదిక, మే 7వ తేదీన గ‌రిష్టానికి చేరుకున్న‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతం గ‌ణాంకాల‌ను బ‌ట్టి చూస్తే.. జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10 వేల‌కు త‌గ్గుతుంద‌ని పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ ఆగ‌ష్టు రెండో ప‌క్షం నుంచి కేసుల సంఖ్య క్ర‌మంగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు హెచ్చ‌రించింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *