COVID -19 Wolrdwide: 2020 in countries without coronavirus cases|2020లో కరోనా రాని దేశాలు!
COVID -19 Wolrdwide: 2020 in countries without coronavirus cases|2020లో కరోనా రాని దేశాలు!New Delhi : చైనాలోని వూహాన్ నగరంలోని పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా వైరస్ ఈ 2020లో ప్రజలకు కునుకు లేకుండా చేసింది. సమస్త వినాశనానికి దారి తీసింది. ప్రపంచ వ్యాప్తంగా 52 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా, సుమారు 7 నెలలుగా ఈ అంటువ్యాధితో పోరాటం చేస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణులు కూడా నూతన సంవత్సరం నుంచి రెండ దశను ఊహిస్తున్నారు. వరల్డ్మీటర్ల డేటా ప్రకాం, ప్రపంచ వ్యాప్తంగా 215 దేశాలు మరియు స్వతంత్ర ద్వీపాలు వైరస్‌తో పోరాటం చేస్తుండగా ఇప్పటివరకు దీని సంక్రమణ కారణంగా 6 లోల మందికి పైగా చనిపోయారు.
ఇప్పటివరకు కోటీ 44 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ 2 లక్షలకు పైగా 40 వేల కరోనా వైరస్ కేసులు వస్తుండగా 5 వేలకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వైరస్ అమెరికా – బ్రెజిల్ మరియు భారతదేశంలో వేగంగా వ్యాప్తిం చెందుతోంది. దేశంలో 11 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికాలో ఈ సంఖ్య 38 లక్షలకు పైగా ఉండగా, బ్రెజిల్ లో 20 లక్షలకు మించిపోయింది. అయితే ఇటువంటి పరిస్థితులో కూడా కొన్ని దేశాలు ఇప్పటికీ కరోనా రహితంగానే ఉన్నాయి. కరోనా మొత్తం ప్రపంచాన్ని నాశం చేస్తున్న సమయంలో, కరోనా వైరస్ ఒక్క కేసు కూడా నివేదించబడని దేశాలు 12 ఉన్నాయి.
1.Kiribati island
2.Marshall island
3.Micronesia
4.Nauru
5.Narth Korea
6.Palau island
7.samoan island
8.Solomon islands
9.Tonga island
10.Turkmenistan
11.Tuvalu
12.Vanuatu
1.Kiribati island.. ఇది రిపబ్లిక్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఓ ద్వీపం. 32 ద్వీపాలతో పెరిగిన పగడపు ద్వీపంతో కూడిన దేశం. ఓషియానియా ప్రాంతంలోని ఈ దేశం జనాభా 1 లక్ష 10 వేలు మాత్రమే. ఇది 1979 లో బ్రిటన్ నుంచి విముక్తి పొందింది. 1999 లో ఈ దేశం ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం పొందింది. ఈ దేశానికి ఏ దేశంతోనూ సరిహద్దు లేదు. కానీ ఫీజీ, నౌరు, మార్షల్ ద్వీపం దగ్గరి ద్వీపసమూహం. ఈ దేశాల జనాభా ప్రధానంగా సముద్ర వనరులు మరియు పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. విభిన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా కరోనా యుగంలో కూడా ఈ దేశంలో ఇప్పటికీ వైరస్ లేదు.
2. Marshall island.. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న మైక్రోనేషయన్ దేశం. దీని జనాభా 58,413 మాత్రమే. ఇది నౌరు మరియు కిరిబాటికి ఉత్తరాన ఉంది. ఇక్కడ అధికారిక కరెన్సీ యూఎస్ డాలర్. ఇంగ్లీష్ మరియు మార్షలీస్ భాషలు ఇక్కడ మాట్లాడతారు. ఇది 29 పగడాలు మరియు 1156 ద్వీపాలను కలిగి ఉన్న ఒక ద్వీపసమూహ దేశం. దీని విస్తీర్ణంలో 3 శాతం మాత్రమే భూమి ఉంది. ఇందులో అతిపెద్ద నగరం మజురో ద్వీపం.
3. Micronesia ..ఈ దేశం 2100 ద్వీపాల సమూహం. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని ప్రధాన ద్వీపసమూహ దేశం. ఇది 2700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గువామ్ దాని అతిపెద్ద ద్వీపం. కరోలిన్ ద్వీపం, గిల్బర్ట్ ద్వీపం, మరియానా ద్వీపం ముఖ్యంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రకృతి సౌందర్యాన్ని సందర్శించే పర్యాటకులకు ఇది ప్రత్యేకంగా ఉంది.
4. Nauru..దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో ఉన్న నౌరు జనాభా 12,704 మాత్రమే. ఇది మార్షల్ ద్వీపానికి దక్షిణాన ఉంది. విస్తీర్ణంలో మొనాకో తర్వాత పరిపాలనా విషయాలలో ఆస్ట్రేలియా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ కరెన్సీ కూడా ఆస్ట్రేలియా డాలర్. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నవంబర్ 1947 లో ఐక్యరాజ్యసమితి క్రింద ఒక విశ్వసనీయ ప్రాంతంగా మారింది. కొంతమంది పర్యాటకులు సాధారణ రోజులలో కూడా ఇక్కడకు వస్తారు. కానీ కరోనా కాలంలో అన్నీ మూసివేయబడ్డాయి.
5.Narth korea.. ఉత్తర కొరియాను కిమ్‌జోంగ్ ఉన్ పాలిస్తున్నారు. ఈ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కిమ్ నియంతృత్వ పాలన కారణంగా ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఇతర ప్రాంతాల నుంచి వేరు చేయ్యబడింది. ఇక్కడ నుంచి ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు. పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో 13 వేలకు పైగా కరోనా కేసులు ఉన్న చోట, ఉత్తర కొరియాలో సున్నా సంఖ్య అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
6.Palau island.. వెస్ట్రన్ పసిఫిక్ మహాసముద్రం భూభాగంలో ఓ భాగం పలవ్. 340 ద్వీపాలు దాని భాగాలు. ఉత్తరాన, ఇది జపాన్‌తో తన సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. తూర్పున మైక్రోనేషియా, దక్షిణాన ఇండోనేషియా మరియు పశ్చిమాన ఫిలిప్పీన్స్ ఉన్నాయి. ఇక్కడ జనాభా 17,907. 29 నవంబర్ 1994న దేశం ఐక్యరాజ్యసమితిలో చేరింది.
ఇది చదవండి: 2021లో నూతన మార్పులు ఇవే!
7.Samoan islanda..రెండు పెద్ద ద్వీపాలతో కూడిన సమోవా జనాభా 1,96,130. ఇది హవాయి దీవులు మరియు న్యూజిలాండ్ మధ్య ఉంది. ఈ ద్వీపం శీతాకాలపు సెలవులకు చాలా ప్రాచుర్యం పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు అమెరికాలో నివసిస్తున్న వలసదారులు పంపిన డబ్బుతో ఆర్థిక వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది. కరోనా కాలంలో, పర్యాటక పనులు చాలా వరకు ఆగిపోయాయి.
8.Solomon islands.. ఓషియానియా ప్రాంతంలో ఉన్న సోలమన్ ద్వీపం 6 పెద్ద ద్వీపాలు మరియు 900 చిన్న ద్వీపాలతో ఈ దేశం రూపొందించబడింది. ఇది పాపువా న్యూ గినియాకు తూర్పున ఉంది. ఇక్కడ జనాభా 652,858. ఇది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం, కానీ కరోనా కాలంలో ప్రతిదీ మూసివేయబడింది.