Covid -19 Variant(B.1.1.529)జర్మనీ: ప్రపంచానికి ఏమైంది… ఒక ప్రక్క పేదరికం, మరో ప్రక్క కరోనా ..కాలు బయట పెట్టనిదే కడుపు నిండదు..కాలు బయట పెడితే కరోనా కాటు వేయక మానదు..ఎన్నాళ్లు ఈ కరోనా బాధలు అంటూ..రెండేళ్ల సంధి జనాలు ఆపసోపాలు పడుతున్నారు. కాస్త పర్వాలేదు కరోనా గోల తగ్గిందనుకుంటే మరలా కొత్త రూపంలో ప్రపంచంలోకి తొంగి చూస్తుంది. అదే కరోనా కొత్త వేరియంట్ అంట. నిన్న ఒక్కరోజే 76,000 కేసులు నమోదయ్యాయంటే దాని పవర్ ఎలా ఉందో తలుచుకుంటేనే మాస్క్ తీస్తే వస్తుందేమోనన్న భయంకరమైన పరిస్థితి ఉన్నట్టు(Covid -19 Variant(B.1.1.529)) అనిపిస్తుంది.
జర్మనీలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. ఇక దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోందని వార్తలు వస్తున్నాయి. రోజుకు 76 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడంతో అక్కడ ప్రజల్లో వణుకు పుడుతోందట. ఇప్పటి వరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్టు జర్మనీ ప్రభుత్వం ఓ ప్రకటనలో ప్రపంచానికి స్పష్టం చేసింది. అంతే కాదు ఆ కేసుల ఉధృతి ఎంతలా ఉందంటే ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ఆస్పత్రులకు తరలించే నిమిత్తం ఆఖరికి వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపింది.
అంతే కాదు జర్మనీలోని దక్షిణ నగరం అయిన మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో ఎక్కవుగా ఉన్న కరోనా రోగులను ఉత్తర ఓస్మాబుక్ సమీపంలోని ముయెన్స్టర్కు తరలించేందుకు జర్మనీ విమానంలో ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు గా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం. కరోనా విషయంలో జర్మనీ విమానాలను వినియోగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బెర్లిన్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాను కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రాంతంగా ప్రకటించనుందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా జర్మనీ దేశం దక్షిణాఫ్రికా నుండి జర్మనులు జర్మనీకి రావడానికి మాత్రమే విమానాలు అనుమతిస్తామని, పైగా వ్యాక్సిన్లు తీసుకున్న వారితో సహా అందరూ 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించింది.


ఈ కొత్త వేరియంట్ ని బి.1.1.529 గా పిలుస్తారని, ఇది యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగల సామర్థ్యం గలదని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ప్రకటించని సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ మరిన్ని సమస్యలను సృష్టింస్తుందన్న ఆందోళనతోనే తాము ముందగానే తగు చర్యలు తీసుకుంటున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!