COVID-19 Vaccination funny video Viral in Karnataka | వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఫొటోలకు పోజులిచ్చి దొరికిపోయారు (వీడియో)Karnataka : దేశంలో కరోనాను నియత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ముందుగా ఆ వ్యాక్సిన్ ను కరోనా వారియర్స్ వేసుకోవాలని కూడా సూచించింది. అయితే కొందరు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. కానీ కొందరు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్నట్టు నటించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా వెలుగు లోకి వచ్చింది. అది ఎక్కడంటే?
కర్నాటక రాష్ట్రంలోని తుమ్మూరులో ఇటీవలే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రౌండ్ వ్యాక్సినేషనలను స్థానిక డీఎంఓ నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రజనీలకు వేయాల్సి ఉంది. అయితే వారు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఫొటోలు, వీడియోలకు మాత్రమే ఫోజులి చ్చారు. వారికి సిబ్బంది కూడా టీకా ఇస్తున్నట్టు నటించారు. నాగేంద్రప్ప, రజనీలు కూడా అదే స్థాయిలో నటనలో లీనమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్యాధికారులు కూడా వ్యాక్సిన్ పై నమ్మకం లేదా? అనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో ధైర్యాన్ని నింపాల్సిన అధికారులే ఇలా నటిస్తారా? అంటూ నెటిజన్లు కొందరు మండి పడుతుండగా, ఆహా.. ఏమి నటించారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీకా మీద వైద్యాధికారులకే నమ్మకం లేదు. ఇక ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోకుండా నటించిన ఆ అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి:మోగిన స్థానిక సంస్థల ఎన్నికల గంట! మరి సజావుగా నడిచేనా?
ఇది చదవండి:ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల “రాజకీయ” పంచాయతీ
ఇది చదవండి:విధి నిర్వహణలో గీత దాటని తల్లి!