covid-19 omicron india live updates: మ‌ళ్లీ 2020 పునరావృతం అయ్యేనా? ఇండియాలో పెరుగుతున్న క‌రోనా కేసులు!

covid-19 omicron india live updates ఢిల్లీ: ఇండియాలో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టామో లేదో క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీన్ని బ‌ట్టి మ‌ళ్లీ ఇండియాలో క‌రోనా కోరాలు చాచింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొన్న‌టి వ‌ర‌కు భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు ఇప్పుడు 30 వేల‌కు పైగా న‌మోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్(covid-19 omicron india live updates) విడుద‌ల చేసింది.

కొత్త కేసులు ఇలా!

గ‌డిచిన 24 గంటల్లో భారత్‌లో 33,750 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3, 49,22,882 కు చేరింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా(covid-19) యాక్టివ్ కేసుల సంఖ్య 1,45, 582 కు చేరింది. ఇక దేశంలో క‌రోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 123 మంది క‌రోనాతో మృతి చెందారు. మృతుల సంఖ్య 4,81, 893కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 10,846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా ఆ రిక‌వ‌రీల సంఖ్య 3,42,95,407 కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,45,68,89,306 మందికి క‌రోనా వ్యాక్సిన్లు చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 23,30,706 మందికి క‌రోనా వ్యాక్సిన్లు వేసిన‌ట్టు పేర్కొంది.

Share link

Leave a Comment