Covid 19 india : అబ్బా! దేశానికి ఎంత క‌ష్టం వ‌చ్చెనో!

Covid 19 india : భార‌త దేశాన్ని ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌న్నీ ప‌రిశీలన‌గా చూస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ మీడియా వేరే వార్త‌ల‌ను చూపిస్తే ఇప్పుడు భార‌త్ దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం విశేషాలు ప్ర‌ధాన వార్త‌గా చూపిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా మ‌ర‌ణాలు, రోద‌న‌లు, జ‌నం అత‌లాకుత‌లం అవుతున్న దృశ్యాల‌ను చూసి ప్ర‌పంచం నివ్వెర పోతుంది. క‌రోనా సృష్టించిన ఈ విల‌య ప్ర‌ళ‌యం ఎప్పుడు మాయ‌మై పోతుంతో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.


Covid 19 india : భార‌త్ దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ఉధృత్తి ఏమాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. ఒక్క ప‌క్క క‌రోనా సోకే వారి సంఖ్య పెరుగుతున్న‌ది. మ‌రో ప‌క్క క‌రోనా సోకి మ‌ర‌ణించే వారి సంఖ్య భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. ఇక ఆసుప‌త్రుల్లో బెడ్లు క‌రువ‌య్యాయి. స్మ‌శానాల్లో స్థ‌లం క‌రువ‌రైంది. ప్ర‌స్తుతం భార‌త దేశం చాలా క్లిష్ట‌మైన‌, ద‌య‌నీయ మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు ఆందోళ‌న‌గానే క‌నిపిస్తున్నాయి. తాజాగా కొత్త వేరియంట్ వ‌ల్ల క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. గురువారం అత్య‌ధికంగా 3,79,257 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క‌రోనా కేసులు, మ‌ర‌ణాల విష‌యంలో అధికార యంత్రాంగం చెబుతున్న లెక్క‌లకు మించి ఎక్కువ‌గానే న‌ష్టం జ‌రిగిపోతుంద‌ని తెలుస్తోంది.

ఇండియాలో క‌రోనా అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1.8 కోట్ల మంది క‌రోనా బారిన ప‌డ్డారు. అందులో దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా మృతి చెందారు. మ‌ర‌ణాల విష‌యంలో ప‌ట్ట‌ణాల్లో లెక్క‌లు నోట్ చేసుకుంటున్న‌ప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మ‌ర‌ణాలు న‌మోదు కాని ప‌రిస్థితి ఉంది. వ‌చ్చే మే నెల‌లో దాదాపు రెండు వారాల పాటు ఈ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌బోతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

బెడ్లు దొర‌క‌డం లేదు!

దేశంలోని ప‌లు రాష్రాల్లో ఉన్న కోవిడ్ ఆసుప‌త్రుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స చేసేందుకు త‌గిన‌న్ని బెడ్లు లేవు. దీంతో రోగులు ఒక్క బెడ్ కోసం ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలోనే ప‌డిగాపులు ప‌డుతూ చికిత్స కై ఎదురు చూస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఆసుప్ర‌తిలో ఒక బెడ్ సంపాదించేందుకు కొన్ని మైళ్ల దూరం ప్ర‌యాణం చేస్తున్నాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. దేశ రాజాధాని ఢిల్లీ లో ఆసుప‌త్రుల‌న్నీ క‌రోనా రోగుల‌తో నిండిపోయాయి. కొత్త‌గా వైర‌స్ సోకిన వారిని చేర్చుకునేందుకు ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. దీంతో ఢిల్లీ న‌గ‌రంలో ఆసుప‌త్రుల బ‌య‌ట ఉన్న వీధులు క‌రోనా రోగుల‌తో నిండిపోయాయి. రోగుల‌కు ఒక స్ట్రెచ‌ర్ కానీ, ఆక్సిజ‌న్ సౌక‌ర్యం కానీ లేదు. ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో క‌రోనా రోగుల‌ను బ‌తికించుకునేందుకు వారి కుటుంబ స‌భ్యులు, ర‌క్త సంబంధీకులు బ‌తిమాలుతున్న దృశ్యం క‌న్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ప్రాణ‌వాయువు ప‌గ‌బ‌ట్టిందా!

దేశంలో క‌రోనా సోకి మ‌ర‌ణించే వారిలో ఎక్కువ శాతం ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్లే మృతి చెందుతున్నారు. ఈ సెకండ్ వేవ్ సృష్టించిన విల‌య‌తాండ‌వానికి తోడుగా ఆసుప‌త్రుల్లో ఆక్సిజన కొర‌త మ‌రింత ద‌య‌నీయ స్థితికి చేర్చింది. కొంత మందికి ఆక్సిజ‌న్ లేదంటూ ఆసుప‌త్రి వ‌ర్గాలు బోర్డులు కూడా పెడుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో ఆక్సిజ‌న్ కు ఉన్న డిమాండ్ ప్ర‌పంచంలో మ‌రే ఇత‌ర దేశాల్లో లేద‌ని ఆక్సిజ‌న్ నీడ్స్ ట్రాక‌ర్ పేర్కొంది. కోవిడ్ సోకిన ప్ర‌జ‌లు ఆక్సిజ‌న్ కోసం అల్లాడుతున్నారు. నీళ్ల నుంచి బ‌య‌ట ప‌డిన చేప‌లు ఏవిధంగా విల‌విల్లాడుతాయో అదే విధంగా క‌రోనా రోగులు విల‌విల్లాడుతున్నారు. దీంతో ఆక్సిజ‌న్ దొరక్క అల్లాడుతూ రోడ్ల‌పైనే ప్రాణాలు వ‌దులుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి పూర్తి సామ‌ర్థ్యం మేర‌కు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అది కూడా వైద్య అవ‌స‌రాల‌కు సైతం స‌రిపోవ‌డం లేద‌ట‌. దేశంలో రోజుకు 7,500 ట‌న్నుల ఆక్సిజ‌న్ త‌యార‌వుతుంటే అదంతా వైద్య అవ‌స‌రాలకే వాడుతున్నార‌ని సీనియ‌ర్ అధికారి రాజేశ్ భూష‌ణ్ వివ‌రించారు.

Share link

Leave a Comment