Covid 19 India : అలెర్ట్ : తీవ్రస్థాయిలో ముప్పు పొంచి ఉంది!
కోవిడ్ పరిస్థితి తీవ్ర స్థాయికి
హెచ్చరిస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ అనతికాలంలోనే ఐదు రెట్లు పెరిగాయని, ప్రస్తుతం దేశంలో కోవిడ్ పరిస్థితి తీవ్రంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. మాస్కులు ముక్కు, నోటిపైనే ఉండాలని సూచించింది. ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి పరిస్థితి చేజారకుండా చూసుకోవాలని సూచిస్తోంది. దేశంలో వైరస్ ఉధృతిపై ఆరోగ్యశాఖ అధికారులు గత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు.


గతేడాది 2020 జూలై నుంచి కోవిడ్ కేసులు దేశంలో విపరీతంగా పెరిగాయన్నారు. సెప్టెంబర్ లో వైరస్ మరింత తీవ్రమైందని, ఆ తర్వాత నుంచి కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది 2021లో మాత్రం ఫిబ్రవరి మధ్య నుంచి కేసులు పెరిగాయన్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని తెలిపారు. దీంతో యావత్ దేశం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంగించరాదని హెచ్చరించారు. వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీ – పీసీఆర్ పరీక్షలు పెంచాలని సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచాలని పేర్కొంది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court