Counselling for Married Couples:దాంప‌త్య జీవితం సాఫీగా సాగ‌డం లేదా? అనుమానాల‌కు చెక్ పెట్టండి ఇలా!

Counselling for Married Couples ఎంతో మంది కొత్త‌గా పెళ్లైన వారిలో దాంప‌త్య జీవితం గురించి ఎన్నో అనుమానాలు, అపోహ‌లు వారి మ‌న‌సును ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. దీంతో వారి లైంగిక జీవితం సాఫీగా సాగే అవ‌కాశం త‌క్కువుగా ఉంటుంది. ఇలాంటి లైంగిక స‌మ‌స్య‌ల గురించి వైద్యులు చెబుతున్న కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు అవ‌గాహ‌న కోస‌మ‌ని మీకు (Counselling for Married Couples)అందిస్తున్నాం. (గ‌మ‌నిక: పెళ్లి అయిన వారు మాత్ర‌మే చ‌ద‌వ‌వ‌లెను.)

ప్ర‌శ్న: పూర్వానుభ‌వం ఉంటేనే దాంప‌త్య జీవితాన్ని సంపూర్తిగా ఆస్వాదించ‌వ‌చ్చ‌ని అంటూ ఉంటారు. కానీ మా ఇద్ద‌రికీ అలాంటి అనుభ‌వాలు లేవు. కొత్త‌గా పెళ్లై కాపురం మొద‌లుపెట్టాం. ఎలాంటి లోటు లేకుండా దాంప‌త్య జీవితాన్ని సంతృప్తిక‌రంగా ఆనందించ‌డానికి ఏమైనా మార్గాలున్నాయా? అస‌లు కొత్త దంప‌త‌లు దాంప‌త్య జీవితంలో ఎలా మ‌స‌లుకోవాలి?

జ‌వాబు: దంప‌తులు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ముందు మాన‌సికంగా చేరువ‌వ్వాలి. ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెర‌గాలి. ఒక‌రినొక‌రు స‌హ‌క‌రించుకోవాలి. ఎదుట వ్య‌క్తి ఆనందానికి ప్రాధాన్య‌మివ్వాలి. ఇలాంటి అంశాల‌న్నీ ఉన్న దాంప‌త్యం క‌చ్చితంగా ఆనంద‌మ‌య‌మ‌వుతుంది. దాంప‌త్య జీవితం సంతృప్తిక‌రంగా సాగ‌డానికి తోడ్ప‌డే అంశాలు మ‌రికొన్ని ఉన్నాయి. అవేంటంటే..

వాస్త‌విక అంచ‌నాలు: పెళ్లికి ముందు దాంప‌త్య జీవితం గురించి ఎన్నో క‌ల‌లు కంటాం. ఇత‌రుల అనుభ‌వాల ఆధారంగా ఏదేదో ఊహించుకుంటాం. దీంతో పెళ్ల‌య్యాక వాస్త‌వం ఊహ‌కు ఏ కాస్త ద‌గ్గ‌ర‌గా లేక‌పోయినా అసంతృప్తికి లోన‌వుతాం. కానీ లైంగిక విష‌యాల ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉండాలి. వాస్తవానికి ద‌గ్గ‌ర‌గా ఆలోచిస్తూ జీవితంలో సెక్స్ ఓ భాగం మాత్ర‌మేన‌ని నిజాన్ని గ్ర‌హించాలి.

నిధాన‌మే ప్ర‌ధానం: త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ తెలుసుకోవాల‌నే త‌త్వం దాంప‌త్య జీవితంలో ప‌నికిరాదు. ఒక‌రి ఇష్టాలు మ‌రొక‌రు తెలుసుకుని మ‌స‌లుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఇదంతా నెమ్మ‌దిగా జ‌రిగే చ‌ర్య‌. లైంగికోద్రేకానికి గురయ్యే చ‌ర్య‌లు, మార్గాల మీద అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకోవాలి. ఈ విష‌యంలో ఒక‌ర్నొక‌రు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇందుకోసం శ‌రీరాలు, అవి స్పందించే తీరుల్ని ఇద్ద‌రూ తెలుసుకోవాలి.

ఎదుటి వారి తృప్తి మీదే దృష్టి: యాంత్రికంగా మసులుకోకుండా ఎదుటి వ్య‌క్తి సంతృప్తే ప్ర‌ధానంగా మ‌సులుకోగ‌లిగితే దంప‌తులిద్ద‌రూ స‌మంగా దాంప‌త్య జీవితాన్ని ఆస్వాదించ‌గ‌లుగుతారు. ఒక‌రి ఆనందం మీద మ‌రొక‌రు దృష్టి పెడితే మ‌న‌సులోని అర్థం లేని భ‌యాలు ప‌టా పంచ‌ల‌వుతాయి. ఆత్మ‌విశ్వాసంతో మెల‌గ‌లుతారు. ఫ‌లితంగా మీ ప్ర‌తి చ‌ర్యా జీవిత భాగ‌స్వామి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. (డా.ష‌ర్మిల మ‌జుందార్- క‌న్స‌ల్టెంట్ సెక్సాల‌జిస్ట్‌)

సుఖ నిద్ర‌తో దాంత‌ప్య వైభోగ‌మే

పెళ్ల‌యిన కొత్త‌లో నిద్ర‌లేని రాత్రులు, క‌ష్ట సుఖాలు స‌హ‌జ‌మే. అయితే కొత్త‌గా వైవాహిక బాంధ‌వ్యంలోకి అడుగిడిన‌వారికే సుఖ నిద్ర చాలా చాలా అవ‌స‌ర‌మ‌ట‌. దంప‌తులిద్ద‌రూ హాయిగా ప‌వ‌ళిస్తే పెళ్లిపైనా, దాంత‌ప్య జీవితంపైనా అనుకూల భావ‌న‌లేర్ప‌డి, కుటుంబ వ్య‌వ‌స్థ‌లో చ‌క్క‌గా ఇమిడిపోతారంటున్నారు ప్లోరిడా విశ్వ‌విద్యాల‌య శాస్త్ర‌వేత్త‌లు. అధ్య‌యనంలో భాగంగా 68 న‌వ జంట‌ల నుంచి కొన్ని రోజుల పాటు ప‌లు వివ‌రాలు రాబ‌ట్టారు. అంత‌గా నిద్ర‌పోనివారు.. త‌మ భాగ‌స్వామితో ఎదుర‌య్యే చిన్న‌పాటి చికాకుల‌కు స‌రిగా అధిగ‌మించ‌లేక‌పోయిన‌ట్టు గుర్తించారు. ఇది క్ర‌మంగా వారి బాంధ‌వ్యంపై ప్ర‌భావం చూపిన‌ట్టు తేల్చారు. అల‌సిన శ‌రీరం కుదుట‌ప‌డేందుకు త‌గినంత విశ్రాంతి అవ‌స‌రం. నిద్రతోనే శ‌క్తి భ‌ర్తీ అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌తా చేకూరుతుంది. అలాంటి వారిలో స్వీయ నియంత్ర‌ణ సామ‌ర్థ్యం ఎక్కువుగా ఉండి, స‌మ‌స్య‌ను సావ‌ధానంగా ప‌రిష్క‌రించగ‌లుగుతారు అని ప‌రిశోధ‌న‌లో పాల్గొన్న హెద‌ర్ మారంజెస్ వివ‌రించారు. భార్య‌, భ‌ర్త‌లిద్ద‌రికీ త‌గినంత నిద్ర అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. జ‌ర్న‌ల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాల‌జీ దీనిపై స‌మ‌గ్ర క‌థ‌నం అందించింది.

Share link

Leave a Comment