Cough and cold home remediesఇది చలికాలం. చాలా మంది జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులేస్తే ఏడు రోజులు.. లేకుంటే వారంలో తగ్గిపోతుంది. జలుబుపై వేసే Joke ఇది. ఏడు రోజులు దాకా అక్కర్లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే మూడు నాలుగు రోజులకి కుదించవచ్చని చెబుతున్నారు వ్యాధి నిరోధక శాస్త్ర నిపుణులు. ఒకటి..మాములు కంటే ఎక్కువుగా నీళ్లు తాగడం. రెండు..కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం. మొదట నీళ్ల సంగతి చూద్ధాం. సాధారణంగా జలుబు అనగానే Chicken Soup తాగడం, ముక్కు దిబ్బడ తగ్గేలా ఆవిరి పట్టడం, జింక్ బిళ్లలు వేసుకోవడం వంటివి(Cough and cold home remedies) ఉపశమనాన్నిస్తాయని చెబుతారు.


కానీ వాటన్నింటికన్నా గంటకు ఒకట్రెండు గ్లాసులు నీళ్లు తాగడం ఎన్నో రెట్లు బాగా పనిచేస్తుంది. ఎలా అంటారా.. జలుబుకి కారణమైన రినో వైరస్ని పారదోలడానికే మన శరీరం mucus (చీమిడి) ని తయారు చేస్తుంది. అదెంత ఎక్కువుగా ఉత్పత్తయితే అంతగా వైరస్ బయటికి పోతుందన్న మాట. ఆ మ్యూకస్ తయారీకి నీళ్లు తప్పనిసరి. మీరెంత ఎక్కువుగా నీళ్లు తాగితే అంతగా ఆ క్రిముల్ని మ్యూకస్ రూపంలో బయటకు గెంటేయొచ్చని చెబుతోంది కొలంబియా విశ్వవిద్యాలం నిర్వహించిన ఓ తాజా పరిశోధన. ఇక నిద్ర.. కనీసం ఎనిమిది గంటలు తప్పనిసరి. ఈ విశ్రాంతితో మీ శక్తి మొత్తాన్ని వ్యాధి నిరోధక వ్యవస్థ వైపు మళ్లించొచ్చు. దీంతో జలుబు బాధల నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతోంది. స్లీప్ సంస్థ నిర్వహించిన ఓ అంతర్జాతీయ అధ్యయనం.
ఆరోగ్య చిట్కాలు
వెల్లుల్లిని బాగా నలిపి గంటకోసారి బాగా వాసన పీలుస్తూ, ఆరు గంటలకొకసారి కొన్ని వెల్లుల్లి రెబ్బలని నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జలుబు తగ్గుతుంది. అల్లం ముక్కని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటెకడు జీలకర్ర పొడి, చక్కెర కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. ప్రతి రోజూ నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరు వెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.


ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంయించుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది. తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు పోతుంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?