Corruption : అవినీతి రాజ్యమేలుతున్న కొద్దీ సామాన్యుడు ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల్లో కొద్ది మంది అధికారులు ఎంచుకునే తప్పుడు మార్గాలు అటు ప్రజల్లోనూ, ఇటు సమాజంలోని నిజాయతీగల అధికారి సేవలు అడుగంటిపోతున్నాయి. లంచం తీసుకుంటే నేరం అని ప్రగల్భాలు పలికే కొంత మంది అధికారులు ఇలా చాటుమాటున ఎంత ఇస్తావు? అని అడిగి వారి చేసే వృత్తికే మచ్చ తెస్తున్నారు కొందరు అవినీతి(Corruption) అధికారులు.
దేశ సరిహద్దుల్లో పెళ్లాం.. పిల్లల్ని వదిలి రేయినకా, పగలనకా పడిగాపులు కాస్తూ కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తున్న సైనికులకు కూడా సమాజంలోకి వచ్చిన తర్వాత కుటుంబంతో కాస్త ప్రశాంతంగా బ్రతుకుదామనుకునే సమయంలో కష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఓ మాజీ సైనికుడికి భూమి ఇచ్చేందుకు ముగ్గురు వీఆర్వోలు లంచం (Corruption)డిమాండ్ చేశారు. ఎన్ని సార్లు తిరిగినా వారు లంచం అడగటంతో విసిగిపోయిన ఆ మాజీ సైనికుడు చివరకు ఏసీబీని ఆశ్రయించాడు. ఆఖరికి రెడ్‌హ్యాండెడ్‌గా డబ్బులు తీసుకుంటూ వీఆర్వోలు దొరికిపోయారు.
వివరాలు పరిశీలిస్తే..నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ఓ మాజీ సైనికుడు తనకు రావాల్సిన భూమి కోసం అధికారులు చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలో ముగ్గురు వీఆర్వోలు బాలనారాయణ, బుచ్చిరాములు, చిన్నయ్య కలిసి భూమి ఇచ్చేందుకు వీలుగా లంచంగా రూ.5లక్షలు డిమాండ్ చేశారు. విసిగిపోయిన మాజీ సైనికుడు బాలరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఇక అనుకున్నట్టు తెల్కపల్లి మండలం లక్కారం వద్ద వీఆర్వోలకు రూ.2లక్షలు లంచం ఇస్తుండగా ముగ్గురు వీఆర్వోలు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చివరకు కటకటాల పాలయ్యారు.
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory