Corona Third wave ఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ మహహ్మారి మరోసారి ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వాలు సైతం సందిగ్ధంలో పడుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.
థర్డ్ వేవ్లోకి జారుతున్న దేశం!
గత వారం రోజుల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దీంతో దేశంలో థర్డ్ వేవ్(Corona Third wave)ను సూచిస్తోందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కె అరోరా అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందని, కాకపోతే భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఆయన.
సౌతాఫ్రికా తరహా ఇక్కడ ఉంటుందా?
దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్ లోకి థర్డ్ వేవ్ ఉధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే తర్వలోనే 3వ ముప్పు గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా గుర్తు చేశారు. వ్యాధి తీవ్రత, ఆస్పత్రి భారిన పడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసులు వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రెండే రెండు వారాల్లో భారీగా కేసులు!
2021 డిసెంబర్ తొలి వారంలో భారత్లో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించారు. రెండు వారాల్లోనే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించింది. ఇప్పటి వరకూ 1892 కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు నమోదవ్వగా, ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థానలో 174, గుజరాత్ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 72 వేలకు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం నాటి బులెటిన్లో పేర్కొంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!