AP Corona Cases : దేశంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యే రాష్ట్రాల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా చూసుకుంటే ఏపీలో 7 జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువుగా పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది.
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు వారాల వ్యవధిలోనే దేశంలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తోన్న 30 జిల్లాల్లో ఏపీ నుంచి ఏడు జిల్లాలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం 20శాతానికి పైగా కరోనా పాజిటివ్ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉందని, తెలంగాణలో రోజువారీ కేసులు గ్రాఫ్ కాస్త తక్కువ అవుతున్నప్పటికీ ఏపీలో మాత్రం పెరుగుతోందని హెచ్చరించారు. రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానంలో ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, దయ్యూదామన్, జార్ఖాండ్, లద్దాఖ్, లక్ష్యదీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లో కేసుల గ్రాఫ్ తక్కువుగా ఉందని తెలిపింది. అత్యధికంగా కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి 4 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో ప్రస్తుతం ఎక్కువుగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహా రాష్ట్ర, పూనే, థానే, ముంబై, లాతూర్, ఔరంగాబాద్, భండారా, ముంబాయి, సబర్బన్, నాందేడ్, గోండియా, ధూలే, నందూర్బార్ జిల్లల్లో, మధ్యప్రదేశ్ (8), ఛత్తీస్‌ఘడ్ (3), ఉత్తరప్రదేశ్ (2), ఝార్ఖండ్, లేహలద్ధాక్, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక 9 రాష్ట్రాల్లో 30 జిల్లాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో బెంగుళూరు అర్బన్, చెన్నై,కేరళలోని కోళికోడ్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు(11), శ్రీకాకుళం(16), తూర్పుగోదావరి(17), గుంటూరు (19), విశాఖపట్టణం(27), అనంతపురం(29), కర్నూలు (30)వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలోని ఉన్న 10 జిల్లాల్లో కేరళ ప్రథమ స్థానం, 7 జిల్లాలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. కర్ణాటక (3), తమిళనాడు (2), హరియాణా (2), మహారాష్ట్ర (2), మధ్యప్రదేశ్(2), బిహార్(1), ఉత్తరాఖండ్ (1) జిల్లాలు ఉన్నాయి.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!