COPD

COPD: డేంజ‌రా..! అంటే డేంజ‌రే! అస‌లు ఏంట‌దీ సిఒపిడి?

Share link

COPD | ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధార‌ణంగా కానొచ్చే శ్వాస‌కోశ వ్యాధి అయిన సిఓపిడి క్ర‌మంగా ఆందోళ‌న క‌లిగించేదిగా మారుతోంద‌ని నిపుణులు అంటున్నారు. Chronic obstructive pulmonary disease(సిఓపిడి) అనేది ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణాల‌ను మూడో అతిపెద్ద కార‌ణంగా నిలుస్తోంది. భార‌త‌దేశంలో సుమారు 15 మిలియ‌న్ల మంది సిఒపిడితో బాధ‌ప‌డుతున్నారు. అన్నింటికి మించి ఆందోళ‌న క‌లిగించే అంశం ఏమిటంటే, అమెరికా, యూర‌ప్‌ల‌తో పోలిస్తే అక్క‌డికి నాలుగురెట్లు అధికంగా ఇండియాలో మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతోంది సిఒపిడి.

శ్వాస‌కోశ ఇబ్బందులే COPDనా?

సిఒపిడిపై అవ‌గాహ‌న లేకపోవ‌డం ఇందుకు కార‌ణంగా చెప్ప‌వ‌చ్చున‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతు న్నారు. ధూమ‌పానం, ఇంధ‌నం పొగ‌, పారిశ్రామిక కాలుష్యానికి గుర‌వ్వ‌డం, మంట‌లు, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం లాంటి సిఒపిడి ముప్పు కార‌క అంశాల‌కు దూరంగా ఉండేందుకు గాను సిఒపిడిపై ప్ర‌జ‌ల‌కు ఎన్నో ర‌కాలుగా స‌మాచారం అందాల‌ని, వాటిపై అవ‌గాహ‌న పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు అంటున్నారు. అనేక విధాలుగా COPD ని పోలీ ఉండే సాధార‌ణ వ్యాధి అస్త‌మా కూడా శ్వాస‌లో ఇబ్బంది రోగ ల‌క్ష‌ణాన్నే క‌లిగి ఉంటుంది. అందుకు నిపుణులు అస్త‌మా నుంచి సిఒపిడిని వేరు చేసి చూడ‌టం అత్యంత ముఖ్య‌మ‌ని అంటున్నారు.అంతేగాకుండా భార‌త‌దేశం వంటి వ‌న‌రుల కొర‌త‌ను ఎదుర్కొనే దేశంలో సిఒపిడి నిర్థార‌ణ కూడా అనేక స‌వాళ్ల‌తో కూడుకున్న‌ద‌ని వారు పేర్కొంటున్నారు.

చాలా మంది రోగులు వ్యాధి బాగా ముదిరిపోయిన ద‌శ‌లో, లంగ్ అటాక్ వ‌చ్చే అవ‌కాశాలు అధిక‌మైపోయిన స‌మ‌యంలో వైద్యుల‌ను క‌లుసుకుంటున్నారు.త‌ద్వారా రోగులు, వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందు ల‌కు గురికావాల్సి వ‌స్తోంది. లంగ్ అటాక్ అనేది ఒక భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితి. ఈ ద‌శ‌లో రోగులు ఆసుప‌త్రి లో చేరాల్సి రావొచ్చు. ఆర్థిక‌, భావోద్వేగ‌ప‌ర‌మైన ప్ర‌భావాల‌కు లోను కావ‌చ్చు. COPDకి చికిత్స చేసే వైద్యుల ప్ర‌ధాన ల‌క్ష్యాల‌లో ఒక‌టి లంగ్ అటాక్స్‌ను నిరోధించ‌డం లేదా ఆ అటాక్‌ల‌ను ఆల‌స్యం చేయ‌డం. ల‌క్ష‌ణాల‌లో కూడిన సిఒపిడి రోగుల స‌త్వ‌ర Screening కు ఇప్పుడు స‌ర‌ళ‌మైన ఉప‌క‌ర‌ణాలు చెప్ప‌వ‌చ్చు లేదా ధ్రువీక‌రించుకునేదుకు త‌దుప‌రి ప‌రీక్ష‌లు చేయించ‌వ‌చ్చు.

పురుషుల్ల‌నే COPD వ్యాధి అధికం

ఈ వ్యాధి మ‌హిళ‌ల‌తో పోలిస్తే పురుషుల్లో అధికంగా క‌నిపిస్తుంద‌ట‌. ధూమ‌పానం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం అని అంటున్నారు వైద్యులు. సిఒపిడి అనేది సాంక్ర‌మికేత‌ర శ్వాస‌కోశ‌వ్యాధి. కాలం గ‌డుస్తున్న కొద్దీ ఇది ఊపిరి తీసుకోవ‌డాన్ని క‌ష్ట‌త‌రం చేస్తుంది. సిఒపిడి క‌లిగిన వారిలో 25 శాతం నుంచి 50 శాతం మందికి త‌మ‌కు సిఒపిడి ఉంద‌ని కూడా తెలియ‌దు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం సిఒపిడి ఆరంభ‌ద‌శ‌లు త‌రుచుగా గుర్తించేందుకు వీల్లేకుండా ఉండ‌ట‌మే. సిఒపిడి ఆరంభ ల‌క్ష‌ణాలునిరంత‌ర ద‌గ్గు, క‌ఫం రావ‌డం, శారీర‌క ప‌నులు చేసేట‌ప్పుడు లేదా మెట్లు ఎక్కేట‌ప్పుడు ఊపిరి ఆడ‌క‌పోవ‌డం లాంటివి అని మీడియా స‌మావేశంలో డాక్ట‌ర్ విజ‌య్ కుమార్ వివ‌రించారు. సిఒపిడిని ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత ప్ర‌భావ‌పూరితంగా చికిత్స అందించ‌వ‌చ్చు అని పేర్కొటున్నారు.

విడాకులకు కార‌ణం అవుతున్న COPD

అత్యంత ప్రాణాంత‌క‌మైన సీఓపీడీ వ్యాధికి ఇప్ప‌టి వ‌ర‌కు వైద్య చికిత్స‌లే లేవు. నిద్ర‌లో నాలుక వెన‌క్కి మ‌డ‌త ప‌డ‌టం ద్వారా శ్వాస ఆగిపోయే ఈ స‌మ‌స్యతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది ప్రాణాల్ని బ‌లితీసు కుంది. గ‌ణాంకాల ప్ర‌కారం అమెరికాలో ప్రాణాలు తీస్తున్న అతి పెద్ద వ్యాధుల్లో సీఓపీడి నాల్గోవ‌ది. విప‌రీ తంగా గుర‌క రావ‌డం వ‌ల్ల సీఓపీడీ బాధితుల్ని నిద్రా స‌మ‌యాల్లో చాలా మంది దూరంగా ఉంచుతారు. ఈ వ్యాధి ఎన్నో ల‌క్ష‌ల విడాకుల‌కు కూడా కార‌ణ‌మ‌య్యింది. ఇదొక సామాజిక వెలివేత లాంటిది. అయితే శ్వాస‌కోస సంబంధిత‌మైన ప‌లు వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో మ్యూజిక్ థెర‌పీ ఎంతో తోడ్ప‌డు తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు కొనుగొన్నారు. వాటిలో ప్ర‌త్యేకించి ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన COPD వ్యాధిని త‌గ్గించ‌డంలో కూడా మ్యూజిక్ థెర‌పీ బాగా తోడ్ప‌డుతుంద‌ని వారు గుర్తించారు.

మ్యూజిక్ థెర‌పీతో ఫ‌లితాలు!

సీఓపిడి, మ‌రికొన్ని తీవ్ర శ్వాస‌కోశ సంబంధిత వ్యాధుల‌ను న‌మ‌యం చేయ‌డ‌మే కాదు. వారి మాన‌సిక ఆరోగ్యాన్ని, జీవ‌న ప్ర‌మాణాల్ని మెరుగు ప‌ర్చ‌డంలోనూ Music Therapy పాత్ర కీల‌కంగా ఉంటోంద‌ని వారు విశ్లేషిస్తున్నారు. కేవ‌లం మందుల‌కే ప‌రిమిత‌మైన వారితో పోలిస్తే, మందుల‌తో పాటు మ్యూజిక్ థెర‌పీ కూడా తీసుకునే వారిలో వ్యాధి చాలా వేగంగా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని వారు త‌మ అధ్య‌య‌నాల్లో క‌నుగొన్నారు. అమెరికాలోని లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ సెంట‌ర్ ఫ‌ర్ మ్యూజిక్ అండ్ మెడిసిన్ వారు జ‌రిపిన ఈ అధ్య‌య‌నంలో మ్యూజిక్ థెర‌పీని శ్వాస‌కోశ వ్యాదుల‌కు ఇవ్వాల్సిన ఒక అద‌న‌పు చికిత్స‌గా వారు చెబుతున్నారు. సీఓపీడీఓ పాటు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, పిల్లి కూత‌లు, నిరంత‌ర‌మైన ద‌గ్గు, త‌రుచూ జ‌లుబు చేయ‌డం, ఫ్లూ బారిన ప‌డ‌టం, ఛాతి ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌టం వంటి స‌మ‌స్య‌ల‌న్నింటికీ మ్యూజిక్ థెర‌పీ ద్వారా ఉప‌శ‌మ‌నం ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

best fruit for lungs: ఊపిరితిత్తుల‌కు beetroot అద్భుత‌మైన మందు

best fruit for lungs ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి త‌రుచూ నీర‌సం, నిస్స‌త్తువ‌తో ఇబ్బంది ప‌డేవారికీ బీట్‌రూట్ మంచి మందుగా ప‌నిచేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే! ఇప్పుడు ఈ బీట్‌రూట్ Read more

Stop Smoking : ఊపిరితిత్తుల‌కు ‘పొగ’ పెట్టొద్దు!

Stop Smoking : ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం. దీని వ‌ల్ల ఎంతో మంది ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. పొగ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌కు గుర‌వ్వుతున్నారు. పొగ తాగ‌డం Read more

Covid Third Wave సంగ‌తేంటంటున్న న్యాయ‌స్థానం!

Covid Third Wave : దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సుప్రీం కోర్టు కేంద్రానికి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. సెకండ్ వేవ్ ముప్పు పోక ముందే Read more

Tumour operation: బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స‌ |Brinda hospital| khammam

Tumour operation: Khammam: న‌గ‌రంలోని భ‌క్త‌రామ‌దాసు క‌ళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్ర‌ముఖ బ్రింద ఆసుప‌త్రిలో శ‌నివారం అరుదైన శ‌స్త్ర చికిత్స చేశారు. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన Read more

Leave a Comment

Your email address will not be published.