Cool Drinks : ఇష్టంగా తాగితే..త‌ప్ప‌దు దుష్ప్ర‌భావాలు! | Cool Drinks side effects

0
95
views

Cool Drinks side effects : అస‌లే ఎండాకాలం దాహం కూడా ఎక్కువ అవుతుంది. ఎండ‌లు మండి పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో మ‌నం ఎక్కువుగా కూల్‌డ్రింక్స్‌ను తాగుతున్నాం. కానీ ఆ డ్రింక్స్ తాగ‌డం అంత‌మంచిది కాద‌ని చెబుతున్నారు నిపుణులు.


Cool Drinks side effects : చ‌ల్ల‌గా, తియ్య‌గా, రుచిగా ఉండే శీత‌ల పానియాల‌ను ఇష్టంగా తాగుతుంటాం క‌దా!. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుక‌ల్లో కూల్ డ్రిక్స్ ఉండాల్సిందే! అయితే, కూల్ డ్రింక్స్ తాగ‌డం ద్వారా మ‌న శ‌రీరానికి ఎలాంటి పోష‌కాలు అంద‌క‌పోగా అవి తాగ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు మాత్రం బోలెడ‌న్నీ ఉన్నాయి. శీత‌ల పానియాల్లో ఉండే అలాంటి ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాల గురించి అవి గ‌లిగించే దుష్ప్ర‌భావాల గురించి తెలుసుకుందాం!

ఫాస్ప‌రిక్ య‌సిడ్ : ఇది ఎముక‌ల‌ను, దంత మూలాల‌ను బ‌ల‌హీన ప‌రుస్తుంది.

క్యార‌మెల్ రంగు : ర‌సాయ‌న క్యారెమెల్ నుంచి త‌యార‌య్యే ఈ ర‌సాయనం డ్రింక్ కు రుచినివ్వ‌క‌పోగా క్యాన్స‌ర్‌కు గురిచేస్తుంది.

ఫార్మ‌ల్ డిహైడ్ : ఇది క్యాన్స‌ర్ కార‌కం. శ‌రీరంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు 2 ఆమీనో యాసిడ్లు మిథ‌నాల్ గా విడిపోతుంది. ఫార్మిక్ యాసిడ్ + ఫార్మాల్‌డిహైడ్ (డైట్ సోడాలు)

అధిక ఫ్ర‌క్టోజ్ కార్న్ సిర‌ప్ : మొక్కజొన్న నుంచి తీసిన కాన్‌సెన్‌ట్రేట‌డ్ షుగ‌ర్‌, ఫ్ర‌క్టోజ్‌. ఇది శ‌రీరంలో కొవ్వు, కొలెస్ట‌రాల్‌, ట్రైగ్లిజ‌రైడ్స్ ను పెంచ‌డంతో పాటు ఆక‌లిని పెంచుతుంది.

పోటాషియం : బెంజోయేట్ పానీయం నిల్వ ఉండ‌టం కోసం దీన్ని క‌లుపుతారు. ఇది శ‌రీరంలోకి చేర‌గానే బెంజీన్‌గా విడిపోతుంది. ఇది కూడా క్యాన్స‌ర్ కార‌మే!.

కృత్రిమ రంగు : దీని వ‌ల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గుతుంది. ఏకాగ్ర‌త‌ను త‌గ్గిస్తుంది. హైప‌ర్‌యాక్టివ్‌గా మారుస్తుంది. ఇన్ని దుష్ప్ర‌భావాలున్నాయి కాబ‌ట్టి, దాహం వేయ‌గానే కూల్‌డ్రింక్ జోలికి వెళ్ల‌కుండా మంచినీరు, కొబ్బ‌రి నీరు, మ‌జ్జిగ‌ల‌ను తాగండి.

ఇంకా..

  1. కూల్ డ్రింక్స్ లో 10 చెంచాల‌కు స‌రిప‌డా షుగ‌ర్ ఉంటుంది. మాములుగా ఇంత మోతాదులో చ‌క్కెర తీసుకుంటే వాంతులు వ‌స్తాయి. కానీ కూల్ డ్రింక్‌లో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం వ‌ల్ల మ‌న‌కు వాంతులు రావు.
  2. కూల్ డ్రింక్స్ వ‌ల్ల షుగ‌ర్స్ లెవ‌ల్స్ బాగా పెరిగిపోయి, కొవ్వుగా మారి బ‌రువు బాగా పెరుగుతార‌ట‌.
  3. కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ వ‌ల్ల ర‌క్త‌పోటు పెరుగుతుంట‌. అలాగే ఇది పెద్ద వారికి అంత‌గా హానీ చేయ‌దు. కానీ చిన్న పిల్ల‌ల‌కు చాలా హాని చేస్తుంది. అందుకే చిన్న పిల్ల‌ల‌కు కూల్ డ్రింక్స్ ఇవ్వ‌కూడ‌దు.
  4. కూల్ డ్రింక్స్ వ‌ల్ల మూత్ర విస‌ర్జ‌న తో పాటు, డీహైడ్రేష‌న్ దాహం ఎక్కువుగా వేయ‌డం జ‌రుగుతుంది.
  5. ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గుతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ వ‌ల్ల శ‌రీరంలో కాల్సియం లెవ‌ల్స్ బాగా త‌గ్గిపోతాయి.
  6. మ‌ధుమేహం, క్యాన్స‌ర్ వ‌చ్చే ఛాన్స్ చాలా ఎక్కువ‌.
  7. లివ‌ర్‌, గుండె సంబంధిత వ్యాధుల‌కు కార‌ణాల‌లో కూల్ డ్రింక్స్ ఒక‌టి.
Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here