cooking oil Price | దేశంలో వంట నూనె ధరలు నెల రోజుల సంధి పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న నూనె ధరలతో పేద, మధ్య తరగతి ఇళ్లలో కూర వండుడే బంద్ చేశారంట. ఎవరిని అడిగినా ఇది వరకు గంటెడు కూరలో నూనె వేసేటోళ్లం. ఇప్పుడు చెంచాడు నూనె వేస్తున్నాం..అంటూ ఆడవాళ్లు వంట నూనె ఘోస చెబుతున్నారు. వంట నూనె ధరల పెరగడంతో hmtv ఛానెల్ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వారి వంట నూనెపై చెప్పే బాధలు, మాటలు చూస్తే వంట నూనె దివ్య ఔషధంగా మారినట్టు అనిపించింది.
తెలంగాణ రాష్ట్రంలో వంట నూనెలపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెలు పెరగడంతో కూరలు చేసుకోవడం బంద్ చేశామని, వెల్లిపాయ కారమో, తొక్కో వేసుకుని ఆకలి తీర్చుకుంటున్నామంటూ కొందరు చెప్పారు. మరికొందరు వంట నూనె పెరగడంతో కూరల్లో ఇప్పుడు స్పూన్డే నూనె వేస్తున్నామని తెలిపారు. మరికొందరు వంట నూనె పెరగడంతో గంజి తాగుతున్నామని చెబుతున్నారు.

వంటనూనెల ధరలు(cooking oil Price) ఎందుకు పెరిగాయనేదానికి పాపం మధ్య తరగతి ఆడవాళ్లకు ఏమీ తెలియక ధరలు పెరిగాయని బాధపడుతున్నారు. ఈ ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించాలని కోరుతున్నారు. మరికొందరు ఈ ధరలు పెరుగుతాయని ముందే తెలుస్తే ఒక 5 కేజీలు వంట నూనె తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే వారమని చెబుతున్నారు. ”మా పిల్ల పచ్చిమిర్చిలో కేజీ నూనె పోసి వేయించింది. ఇది తెలిసిన మా ఆయన నాతో గొడవ పడ్డాడు. ఇప్పుడు ఈ వంట నూనె పెరగడం వల్ల మా ఆయనకు, నాకు గొడవ నడిసిందని ఫన్నీగా చెప్పింది” ఓ ఇంటి యజమానురాలు.
ముసలవ్వలను వంట నూనెపై అభిప్రాయం అడగ్గా ఏదో గ్లాసుడు అన్నం వండుకుంటున్నాం. చింతకాయ తొక్కో, ఉల్లిగడ్డ కారమో వేసుకుని తిని బ్రతుకుతున్నాం అని చెబుతున్నారు. కేసీఆర్ మా పింఛన్లు పెంచి, నూనె రేట్లు తగ్గించాలే అంటూ చెబుతున్నారు. చికెన్ ధరలు పెరగడంతో అసలు చికెన్ తినడమే బంద్ చేశామని మరికొందరు చెప్పారు. ఇలా కాయా కష్టం చేసుకునే వారు వంట నూనె ధరలు వల్ల సరిగ్గా వండుకోలేని పరిస్థితి నెలకొంది. మరికొందరు ఇళ్లల్లో నూనె, చికెన్ తినలేకపోతున్నామని చెబుతున్నారు.

ఉక్రెయిన్- రష్యా యుద్దం పేరును చూపి ఇక్కడ ఆయిల్ వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనేది సామాన్యుడి అభిప్రాయం. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనకు ఈ బాధలు ఏమిటని, ప్రభుత్వాలు పట్టించుకొని వంట నూనె ధరలు సక్కగా తగ్గిస్తేనే తినగలుగుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వంట నూనె ధరలు పెరుగుదల క్రమంలో కల్తీ నూనె కూడా మార్కెట్లో పంపిణీ అవుతోంది. నూనె ధరలు సాకుగా చూపి కోట్లకు పడగలెత్తే వ్యాపారులకు ప్రభుత్వాలు కళ్లెం వేయాలని పేద, మధ్య తరగతి కుటుంబాల వారు విన్నవించుకుంటున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!