Khammam Government Hospital

Khammam Government Hospital: 15 నెలలుగా జీతాల్లేవు | ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రి ఎదుట ఆందోళ‌న‌

Spread the love

Khammam Government Hospital: ఖ‌మ్మం జిల్లా ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కింద ప‌నిచేస్తున్న 100 మంది కార్మికుల‌కు 15 నెల‌లుగా జీతాలు ఇవ్వ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌ని సిఐటియు, ఐఎఫ్ టియు కార్మిక సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.


Khammam Government Hospital: ఖ‌మ్మం ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రి ఎదుట శుక్ర‌వారం సిఐటియు, ఐఎఫ్‌టియు ఆధ్వ‌ర్యంలో విధులు బ‌హిష్క‌రించి పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా సిఐటియు జిల్లా అధ్య‌క్షులు తుమ్మ విష్ణువ‌ర్థ‌న్‌, ఐఎఫ్‌టియు జిల్లా కార్య‌ద‌ర్శి జి.రామ‌య్య మాట్లాడారు. గ‌త కోవిడ్ స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో సుమారు 100 మంది కార్మికులు విధుల్లోకి తీసుకొని ఈ రోజు వ‌ర‌కు అంటే 15 నెల‌లుగా జీతాలు ఇవ్వ‌కుండా అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని వారు తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో కార్మికులు త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి తీవ్రంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశార‌ని అయినా కార్మికుల‌ను గుర్తించ‌డంలో ప్ర‌భుత్వం అధికారులు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఒక నెల జీతం రాక‌పోతేనే అత‌లాకుత‌లం అవుతున్న స‌మ‌యంలో 15 నెల‌లుగా జీతాలు ఇవ్వ‌కుండా ప‌స్తుల‌తో ప‌ని చేయించుకుంటున్నార‌ని వారు పేర్కొన్నారు. వీరికి జీతాలు చెల్లించాల‌నే గ‌తేడాది కాలంగా కార్మిక సంఘాలు రాష్ట్ర ఉన్న‌తాధికారులకు జిల్లా ఉన్న‌తాధికారులు అంద‌రి దృష్టికి స‌మ‌స్య‌లు తీసుకెళ్లామ‌ని తెలిపారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చిన అధికారులు నేటి వ‌ర‌కు స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేయ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంట్రాక్ట‌ర్‌కు వ‌ర్క్ ఆర్డ‌ర్ ఇవ్వ‌కుండా జీతాలు ఇవ్వ‌మంటే ఎలా వేస్తార‌ని వారు ప్ర‌శ్నించారు.

ఆసుప‌త్రి అధికారుల‌తో చ‌ర్చిస్తున్న నాయ‌కులు

వెంట‌నే జిల్లా అధికారులు కార్మికుల స‌మ‌స్య‌ల‌పై జోక్యం చేసుకొని కార్మికుల‌కు న్యాయం చేయాల‌ని లేని యెడ‌ల కార్మికుల ఆందోళన ఉధృతం చేస్తామ‌ని వారు తెలిపారు. బుధ‌వారం వ‌ర‌కు జీతాలు ఇస్తామ‌ని ప్ర‌భుత్వ ఆసుప్ర‌తి సూప‌రిండెంట్ హామీ ఇవ్వ‌డంతో ఆందోళ‌న విర‌మించామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్మిక సంఘాల నాయ‌కులు పి.ర‌మ్య‌, ఏ రామారావు, కె.వెంక‌న్న‌, ముర‌ళి, విజ‌య‌మ్మ‌, వెంక‌ట‌ర‌మ‌ణ‌, క‌మ‌ల రాధా, మ‌మ‌త‌, క‌ళ్యాణి, అశోక్‌, స‌త్య‌వ‌తి, అంజ‌లి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Labor unions : రైతుల జీవితంలో మ‌ట్టి పోసిన కేంద్రం

Labor unions : రైతుల జీవితంలో మ‌ట్టి పోసిన కేంద్రం : భార‌త్ బంద్‌ను విజ‌యవంతం చేయండి : కార్మిక సంఘాలు Labor unions : Khammam: Read more

Tumour operation: బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స‌ |Brinda hospital| khammam

Tumour operation: Khammam: న‌గ‌రంలోని భ‌క్త‌రామ‌దాసు క‌ళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్ర‌ముఖ బ్రింద ఆసుప‌త్రిలో శ‌నివారం అరుదైన శ‌స్త్ర చికిత్స చేశారు. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన Read more

Ettari Antayya: వ‌డ్డెర సంఘం కోసం నేను అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తా!

Ettari Antayya | వ‌డ్డెర సంఘం అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర Shrama Sakthi అవార్డు గ్ర‌హీత‌, వ‌డ్డెర సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ఎత్త‌రి అంత‌య్య Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Leave a Comment

Your email address will not be published.