Minister Srinivas goud

Minister Srinivas goud: తెలంగాణ మంత్రి హ‌త్య‌కు కుట్ర న‌లుగురి అరెస్టు

Telangana

Minister Srinivas goud | తెలంగాణ మినిస్ట‌ర్ శ్రీ‌నివాస్‌గౌడ్ కు కుట్ర ప్ర‌య‌త్నం భ‌గ్నం చేశారు సైబ‌రాబాద్ పోలీసులు. న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అబ్కారీ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ తో పాటు ఆయ‌న అనుచ‌రుల హ‌త్య‌కు ప‌న్నిన కుట్ర‌ను చేధించిన‌ట్టు సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌క‌టించారు. బుధ‌వారం సైబరాబాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర మీడియా స‌మావేశంలో (Minister Srinivas goud) మాట్లాడారు.

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు రూ.12 కోట్ల సుపారీ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. శ్రీ‌నివాస్ గౌడ్ కు సంబంధించిన అనుచ‌రులు హ‌త్య‌కు ప‌న్నిన కుట్ర‌ను చేధించిన‌ట్టు సైబ‌రాబాద్ పోలీసులు తెలిపారు. సుపారీ గ్యాంగ్‌తో హ‌త్య‌కు ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్టు అనుమానిస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన వ్య‌క్తులు, మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌తో పాటు ఆయ‌న సోద‌రుడు శ్రీ‌కాంత్‌గౌడ్ ను ల‌క్ష్యంగా చేసిన‌ట్టు అనుమానిస్తున్నారు.

రూ.12 కోట్ల‌కు సుపారీ ఒప్పందానికి ఫ‌రూక్ అనే వ్య‌క్తిని సంప్ర‌దించ‌గా అత‌డు పేట బ‌షీర్‌బాద్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. హ‌త్య‌కు కుట్ర‌లో భాగ‌స్వాములైన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన నాగ‌రాజు, యాద‌య్య‌, విశ్వ‌నాథ్‌ల‌పై గ‌తంలోనూ హ‌త్య కేసులు ఉన్నాయి. ఈ ముగ్గుర్నీ హైద‌రాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

నాగ‌రాజు ఇచ్చిన స‌మాచారంతో హ‌త్య కుట్ర‌లో భాగ‌స్వామి ర‌ఘును అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ నేత‌, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ర‌ఘును పోలీసులు అరెస్టు చేశారు. ర‌ఘుకు ఆశ్ర‌య‌మిచ్చిన మ‌రో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వ‌దిలేశారు. హ‌త్య‌కు కుట్ర‌కోణాన్ని సైబ‌రాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసుల‌కు తెలియ‌జేశారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *