Nagarjuna Sagar by Election : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్ధార్
Nagarjuna Sagar by Election : ‘కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడితే ఖబర్జార్..’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మరోసారి కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. నేడు నార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగులపల్లి మండలం అభంగాపురం, గజలాపురం, పూసలాపాడు, నారాయణపురంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు.
ఈ గ్రామాల ప్రజలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రూ.200 కోట్లు ఉన్న సురభి వాణిని నిలబెట్టిన నువ్వు, మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. శ్రీకాంతా చారి ప్రాణాలు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయ్యారని అలాంటి అమరుడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఎంటనీ? ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారార్జున సాగర్లో జానారెడ్డికి వస్తున్న మద్దతును చూడలేక టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడు తున్నారని వివరించారు. ఎక్కడో ఇతర జిల్లాల నుంచి వచ్చి నల్గొండ కాంగ్రెస్ నేతలను బెదిరిస్తే ఖబర్థార్ అని హెచ్చరించారు. మా వాళ్ల జోలికి వస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కూడా ధైర్యం కోల్పోకూడదని తెలిపారు. మీకు అండగా మేము ఉన్నామని వివరించారు.
శాసన సభ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రస్తావించి, వాటికి నిధులు తీసుకోవాలన్నారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వారిని నమ్మి గెలిపించిన ప్రజలు సమస్యలను గాలికి వదిలి అసెంబ్లీ నడుస్తున్న సాగర్లో డబ్బు మూటలతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో సొంత బిడ్డను గెలిపించుకోలేని అసమర్థ కేసీఆర్ నాగార్జున సాగర్ ఎన్నికల్లో వారి అభ్యర్థిని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్ వారి ఇంట్లో నుంచి ఇస్తున్నారా? అని అడిగారు.
1200 మంది పిల్లలు చనిపోతే పిల్లల మరణాలకు చలించి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో మళ్లీ యువత ప్రాణాలు వదలడం బాధాకర విషయమన్నారు. 2 లక్షాల ఉద్యోగాల ఖాళీగా ఉన్న కేసీఆర్ నోటిఫికేషన్లు వేయకపోవడం వల్లే యువత ఉద్యోగాలు రావని మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ వరకు నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, అసలు బడ్జెట్లో కేటాయిపులు జరపలేదని తెలిపారు. తెలంగాణలో గులాం గురిచేస్తే కాదు. ధైర్యంగా ఎదరిస్తే మన హక్కులు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని వెల్లడించారు.
ఉద్యోగాలు 7.5 శాతం పీఆర్సీ ఇస్తానంటే భయపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొడుతామని చెప్పి 30 శాతం పీఆర్సీ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతుకు ఉంటేనే సర్కార్ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పాలనలో నాగార్జున సాగర్ను పట్టించుకోవట్లేదన్నారు. జానారెడ్డి హయాంలోనే ప్రతి గ్రామానికి వందల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరించారు. ఇప్పటీ వరకు నాగార్జున సాగర్ గ్రామాల్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదని తెలిపారు. గాలికి ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా ఎలాంటి అవినీతి మచ్చ లేని జానారెడ్డిపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని మండిపడ్డారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court