Congress Party: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పటికే బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు ప్రచారాల దూకుడును పెంచాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ తమ పార్టీ నుండి నిలబెట్టే అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయితే కొద్ది రోజులుగా కొండా సురేఖను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబెడతారనే ప్రచారం కొనసాగు తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం(Congress Party) దాదాపుగా ఖరారు చేసింది. త్వరలో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయమై శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలించింది. అయితే అంతిమంగా సురేఖ పేరును ఆ పార్టీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే ఈటల సగం బీసీ, సగం ఓసీ అంటూ టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. టీఆర్ఎస్ ఇలా ప్రచారం చేయడమే కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజూరాబాద్ నుంచి బరిలోకి దింపుతుంది. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటు దళిత బంధు పథకంతో ఆ వర్గం ఓట్లను, ఇటు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ ఆశ పెట్టుకుంది.
కొండా సురేఖను పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్ కు ఓ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా అంటే సురేఖ భర్త కొండా మురళీది మున్నూరు కాపు సామాజిక వర్గం కాగా, సురేఖది పద్మశాలి సామాజిక వర్గం. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని అంచనాతో ఉంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి