Khammam Corporation Election : నామినేషన్ దాఖలు చేసిన Balagangadhara Tilak
Khammam Corporation Election : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ బి-బ్లాక్ అధ్యక్షులు యర్రం Balagangadhara Tilak ఖమ్మం నగర పాలక సంస్థ 36 డివిజన్ కార్పొరేటర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. తాను దాదాపు మూడున్నర దశబ్ధాలుగా రాజకీయ రంగంలో రాణిస్తున్నాని అన్నారు. మున్సిపల్, నగర పాలక సంస్థ కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా పనిచేసే మహాభాగ్యం గాంధీచౌక్ ప్రజలు రెండు సార్లు కల్పించారని తెలిపారు. సంపూర్ణ జన సహకారంతోనే తాను సమగ్రాభివృద్ధికి బాటలు వేయగలిగానని తిలక్ అన్నారు.
తాను గెలిచిన డివిజన్ పూర్తిస్థాయి అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. జిల్లాలో అత్యంత కీలకమైన వాణిజ్య వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న గాంధీచౌక్ చైతన్య వంతులైన ప్రజల నివాస ప్రాంతమని చెప్పుకొచ్చారు. ప్రజా చైతన్యం మెండుగా ఉన్న ప్రాంతం కావడంతో ప్రజాతీర్పు ఎప్పుడూ తనని వరించిందని, అన్వి సర్వేల్లోనూ బెస్ట్ డివిజన్‌గా నిలిచిందని అన్నారు. 36వ డివిజన్లో పోటీ చేస్తున్న తనకి మరో సారి అవకాశం కల్పించాలని ప్రజల ఆశీర్వాదం కోసం ఇంటింటికి వెళ్లానని పేర్కొన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారని, తనకు హ్యాట్రిక్ ఖాయమని ఓటర్లు భరోసా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంతృప్తితో స్థానికులందరి సహకారంతో భవిష్యత్తు రాజకీయాల్లో మరింత రాణించగలనని తెలిపారు. నగర పాలక ఎన్నికల్లో గెలిపిస్తామని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించడంతో గాంధీచౌక్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజల సూచనల మేరకు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా బాటలు వేసే శుభ సంకల్పం కలిగిందని అన్నారు. తనను ముచ్చగా మూడోసారి గెలిపించడానికి సంసిద్ధం అయిన ఓటర్లకు తిలక్ కృతజ్ఞతలు తెలిపారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం