Confidor Insecticide: వ్యవసాయంలో పంటలకు వాడే Confidor గురించి తెలుసా? ఈ కాన్ఫిడార్ అనే రసం పీల్చే పురుగుల మందు లో ఉండే క్రియాత్మక రసాయనకం పేరు Imidacliprid Insecticide అని అంటారు. ఈ మందును BAYER కంపెనీ వారు confidor అనే వ్యాపార నామంతో అమ్ముతున్నారు. ఈ మందు అనేక రకాల కంపెనీల పేర్లతో వస్తుంది. అయినప్పటికీ ఈ BAYER కంపెనీ చేసిన కాన్ఫిడర్ మందుపైనే రైతులకు నమ్మకం ఏర్పండింది.
Imidacliprid Insecticide అనే మందు రసాయన నామం Systemic Insectidide గా చెప్పవచ్చు. సిస్టమిక్ ఇన్సిటైడ్ అంటే పంటలో ఏ మొక్కకైనా తన విడిభాగాలు అనగా కాండం, ఆకులు, పువ్వులు, కాయల భాగాల్లో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించే ఎటువంటి పురుగులనైనా చంపే గుణం ఉంటుందని అర్థం. ఈ మందు పిచికారీ చేసినప్పుడు పురుగులు ఆ మొక్కపైన ఆహారం తీసుకోగా పురుగులు అపస్మారక స్థితిలోకి వెళ్లి నరాలు చచ్చుబడి చనిపోతాయని తయారీదారులు చెబుతున్నారు.
మిరప పంట లో ముడతలకు, వరిపంటలో సుడులు సుడులుగా ఎండిపోయేందుకు వాలే తెల్లదోమ నివారణకు ఉపయోగపడుతుంది. మిరపలో ముడతను సమర్థవంతగా నివాసరిస్తుంది.ఈ కాన్ఫిడర్లో ఉండే Imidacliprid(ఇమిడాక్లిప్రిడ్) 17.80% గా చెప్పవచ్చు. అలాగే నిమ్మ చెట్లపైన ఆకు తొలిచే పురుగు పత్రాలను తిని నాశనం చేస్తుంది. అందుకు కూడా ఈ మందు పిచికారీ చేస్తుంటారు. అదే విధంగా మామిడి చెట్లకు ఆకులపై నల్లని పదార్థం జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇది ప్రతి మామిడి తోడలోనూ మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి ఈ మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
చెరుకు మడులల్లో కూడా గడలకు చెదల సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఆ చెదలను నివారించేందుకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇది పసుపు రంగులో కనిపించే సింబల్ ఆధారంగా కీటక నాశిని మందుగా గుర్తించవచ్చు. ఇది 100 ml వచ్చి ధర రూ.400 వరకు ఉంటుంది.
Confidor Insecticide ను ఎలా ఉపయోగించాలి?
– మిరప తోటలో ఈ మందును పిచికారీ చేసేటప్పుడు 10 లీటర్ల నీటికి 3 ml మందును కలిపి వాడాలని తయారీదారులు చెబుతున్నారు.
– వేరు శనగ పంట పైన కూడా ఈ మందును 10 లీటర్ల నీటికి 3 ml మందును కలిపి వాడాలని తయారీదారులు చెబుతున్నారు.
– రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయ ఏమిటంటే? కాంటాక్ట్ పురుగు , సిస్టమిక్ పురుగు అనేవి రెండు ఉంటాయి. కాంటాక్ట్ పురుగు మందు కేవలం పురుగుకు తగిలితేనే చనిపోతుంది. కానీ ఈ సిస్టమిక్ పురుగు మందు చెట్టుపైన ఏ ఇతర భాగాల్లో ఉన్న కచ్చితంగా పురుగు చనిపోతుంది.
– తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమతో పాటు రకరకాలపైన పచ్చదోమలకు రసం పీల్చే పురుగులు అన్నింటికీ కూడా (వరి, పత్తి, మిరప, వేరు శనగ, చెరుకు,నిమ్మ, టమాటా, మామిడి తోటల్లో) చంపేందుకు ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది.
– పేనుబంక, తెల్లదోమ నివారించేందుకు పత్తిపంటలో పిచికారీ చేస్తుంటారు. అలాంటప్పుడు ఇక పత్తిపంట చేతికొచ్చి కోత ఇంకా 40 రోజుల్లో ఉంటుందనుకున్న సమయం నుంచి ఈ మందు పత్తి చేనుపై కొట్టకూడదు.
– గోధమురంగు, దోమ/ సుడిదోమ, తెల్ల వెన్నుదోమ, పచ్చ దోమ నివారించేందుకు వరి పంటలో కూడా పంట కోత సమయంకు 40 రోజుల ముందు ఈ మందును కొట్ట కూడదు.
– పచ్చదోమ, ముడత, తెల్లదోమ నివారించేందుకు ప్రొద్దుతిరుగుడు పంటలో మందు కొట్టిన తర్వాత 30 రోజుల వరకు కోత కోయకూడదు.
– నిమ సిల్లా పురుగు నివారించేందుకు నిమ్మ, నారింజ తోటల్లో కోతకు 15 రోజుల ముందు పిచికారీ చేయాలి.
– ఎకరానికి ఈ మందు 200 లీటర్లు మోతాదులో రైతులు రసం పీల్చే పురుగులు చంపేందుకు పిచాకారీ చేసినట్టయ్యింతే ఉపయోగం ఉంటుంది.
– ఈ మందు పిచికారీ చేసే వారు తప్పకుండా కళ్ల జోడు గానీ, హెల్మెట్ గానీ ధరించాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు షూ తప్పకుండా వేసుకోవాలి. మాస్క్ ధరించాలి. ఈ మందు అంత్యత రసాయన ప్రభావం కలిగి ఉంటుంది కనుక చర్మానికి ఈ మందు తగిలినప్పుడు చర్మవ్యాధులు, ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.