Core Web Vitals Assessment: Computer safety tips:క‌ద‌ల‌కుండా ప‌నిచేస్తే కీళ్లు ప‌ట్టేసిన‌ట్టే.. కంప్యూట‌ర్‌తో

Computer safety tips:క‌ద‌ల‌కుండా ప‌నిచేస్తే కీళ్లు ప‌ట్టేసిన‌ట్టే.. కంప్యూట‌ర్‌తో జ‌ర‌భ్ర‌దం!

Computer safety tipsప్ర‌స్తుతం ఆఫీస్‌కు, ఇంటికి తేడా లేకుండా ప‌నుల‌న్నీ కంప్యూట‌ర్తోనే జ‌రుగుతున్నాయి. చాలా మందికి కంప్యూట‌ర్ ,లాప్‌టాప్ లేక‌పోతే రోజు గ‌డ‌వ‌దు. కంప్యూట‌ర్ మ‌నిషి జీవితంలో ఒక భాగ‌మైంది. ఈ కార‌ణంగా అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా (Computer safety tips) త‌లెత్తుతున్నాయి.

ఆఫీసుల్లో గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ముందు కూర్చొని ప‌నిచేసే ఉద్యోగుల్లో చాలా మంది కీళ్ల నొప్పుతో బాధ‌ప‌డుతున్న‌ట్టు బ్రిట‌న్ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ప‌రిశోధ‌కులు ఈ స‌మస్య‌ను ఆఫీసు నీ.. అని వ‌ర్ణిస్తున్నారు. ఊబ‌కాయం(obesity), క‌ద‌ల‌కుండా కూర్చొని ప‌నిచేయ‌డం దీనికి దోహ‌దం చేస్తున్నాయ‌ని వివ‌రిస్తున్నారు. ఇది అన్ని వ‌య‌సుల వారిలో క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ 55 ఏళ్ల పైబ‌డిన వారు మ‌రింత ఎక్కువుగా బాధ‌ప‌డుతున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. ఊబ‌కాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతీ మున్ముందు మోకాళ్ల మార్పిడి అవ‌స‌రం గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఈ కంప్యూట‌ర్ కీళ్ల నొప్పుల(Arthritis) ముప్పు త‌గ్గించుకోవ‌డానికి గంట‌కు ఒక‌సారైనా కంప్యూట‌ర్ ముందు నుంచి లేచి, కాసేపు అటూ ఇటూ తిర‌గ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, త‌ర్వాత వామ‌స్ చేయాల‌ని, మోకాళ్ల‌కు ప‌ట్టీల వంటివి ధ‌రించాల‌ని చెబుతున్నారు.

ఆరోగ్య స‌మ‌స్య‌లివే

-కంప్యూట‌ర్ విజ‌న్ సిండ్రోం (సిపియ‌స్‌)(Computer Vision Syndrome -CPS))

-రిపిటేష‌న్ స్టిముల‌స్ ఇంజూరి (Repetition Stimulus Injury)

-కండ‌రాల నొప్పులు (Muscle aches)

-నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం

-స‌రి అయిన వ్యాయామం లేక బి.పి, మ‌ధుమేహ జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం

తీసుకోవాల్సిన జాగ్ర‌త‌లివే

-త‌క్కువ రేడియేష‌న్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిట‌ర్స్‌ను ఎంచుకోవాలి. యాంటీగ్లీర్ స్క్రీన్(anti glare screen) వాడాలి. త‌ద్వారా మోనిట‌ర్(monitor) నుండి వ‌చ్చే రేడియేష‌న్ ప్ర‌భావం కంటిపై కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది.

-ప‌ని చేస్తున్న‌ప్పుడు ప్ర‌తి మూడుగంట‌ల‌కు ఒక సారి క‌నీసం 10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవ‌డం, చ‌ల్ల‌టి నీటితో ముఖం క‌డుక్కోవ‌డం చేయాలి. ఎక్కువ సార్లు క‌ను రెప్ప‌లు మూసి తెరుస్తూ ఉండాలి.

-కంటికి స్క్రీన్ కు మ‌ధ్య దూరం 55 నుంచి 75 సెం.మీ. వ‌ర‌కు ఉండాలి. సాధార‌ణంగా మోనిట‌ర్ మ‌ధ్య‌భాగం క‌ళ్ళ‌తో పోల్చిన‌ప్పుడు 2 నుంచి 3 అంగుళాలు కింద‌కి ఉండాలి. దీని వ‌ల్ల కంటి పాపు క‌నురెప్ప‌లు కొంత వ‌ర‌కు క‌ప్పి ఉంచుతాయి.

-ఏసీ ఉన్న‌గ‌దుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా క‌ళ్ల‌కు త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

-కంప్యూట‌ర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్ ఉండ‌కూడ‌దు. దీని వ‌ల్ల కాంతి కిర‌ణాలు క‌ళ్ల‌పై ప‌డ‌తాయి. దీన్ని నివారించాలి.

-కంప్యూట‌ర్ మోనిట‌ర్‌ని క‌ళ్ల‌కు స‌మాన‌మైన ఎత్తులో ఉండేట్టు చూసుకోవాలి.

-కాళ్ల‌కి కూడా స‌పోర్ట్ వాడాలి.

-ఎడ‌తెర‌పి లేకుండా ప‌నిచేయ‌కుండా మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని నిమిషాలు లేచి అటూ ఇటూ న‌డ‌వాలి.

-ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *