Company IPO

Company IPO: కంపెనీ ఐపిఓల‌ను ఎందుకు జారీ చేస్తుంది?

stock market course
Share link

Company IPO: ప‌బ్లిక్ అవ‌డం వ‌ల్ల, కంపెనీల‌కు ప్రాజెక్టుల‌ను స్థాపించ‌డానికి, లేదా న‌వీక‌ర‌ణ‌, విస్తార‌ణ చేయ‌డానికి, లేదా కొన్ని స‌మ‌యాల‌లో మూల‌ధ‌నం సేక‌రించ‌డానికి, లేదా అప్పుల‌ను తీర్చ‌డానికి అవ‌కాశం క‌లుగు తుంది. దీనిని మూల‌ధ‌నం యొక్క కొత్త ఇష్యూ అంటారు. ఈ ఇష్యూ యొక్క రాబ‌డులు కంపెనీకి వెళ్తాయి.

కంపెనీలో ఉన్న మూల‌ధ‌న పెట్టుబ‌డిదారులు Company Share హోల్డింగు నుండి పూర్తిగా లేదా పాక్షికంగా నిష్క్ర‌మించ‌డం కోసం లేదా పెట్టుబ‌డిదారులు వాళ్ల వాటాల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం ఒక మార్గం ఏర్ప‌ర‌చుకోవానికి కంపెనీలు ప‌బ్లిక్ అవుతాయి. దీనిని అమ్మ‌క ప్ర‌తిపాద‌న అంటారు. దీనిలో వ‌చ్చిన లాభాలు షేర్ హోల్డ‌రుల‌కు వెళ‌తాయి. కానీ కంపెనీకి కాదు.

Company IPO కొర‌కు నిబంధ‌న‌లు!

ప‌బ్లిక్‌లో పాల్గొన‌డం వ‌ల్ల‌, అటువంటి కంపెనీలు, స‌రియైన మ‌రియు స‌ముచిత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయా లేదా అని సెబి ప‌రిశీలిస్తుంది. ముఖ్యంగా చిన్న వాటాదారుల విష‌యంలో అటువంటి కంపెనీల‌కు మంచి Board off డైరెక్ట‌ర్లు ఉండాలి. అందులో క‌నీసం స‌గం స‌భ్యులు వ్య‌వ‌స్థాప‌కులు లేదా కంపెనీకి సంబంధించిన వాళ్లై ఉండాలి. అంతేకాకుండ‌, కంపెనీలు జాబితాలో చేర్చ‌డానికి ఉన్న ఒప్పందాల‌ను పాటించాలి. అంటే, ఇత‌ర విష‌యాల‌తో పాటు, నిర్ణ‌యించిన విధంగా నిర్ధిష్ట‌మైన నిబంధ‌న‌లు అన్ని పాటించాలి.

Stock Market

Company IPO: కంపెనీలు ధ‌ర నిర్ణ‌యించ‌డంలో ఏదైనా నిర్భంధాలు ఉన్నాయా?

1992 నుండి కంపెనీలు త‌మ ఇష్యూల‌కు ధ‌ర నిర్ణ‌యించ‌డ‌ములో స్వేచ్ఛ ఇవ్వ‌బ‌డింది. ధ‌ర నిర్ణ‌య‌ములో సెబికి ఎటువంటి పాత్ర లేదు. అందువ‌ల్ల నిర్ణీత ధ‌ర ఇష్యూల‌లో ఏకైక ధ‌ర‌ను మ‌రియు బుక్‌బిల్డింగ్ ఇష్యూల‌లో ధ‌ర బ్యాండ్‌ను కంపెనీనే నిర్ణ‌యిస్తుంది. అయితే ధ‌ర నిర్ణ‌యం వెనుక ఉన్న పూర్తి న్యాయ‌మైన కార‌ణాల‌ను ఆఫ‌ర్ ప‌త్ర‌ములో కంపెనీలు వెల్ల‌డించాలి. ఇష్యూ ధ‌ర ఏ ఆధార‌ము మీద నిర్ణ‌యించ‌బ‌డిందో ఆఫ‌ర్ ప‌త్ర‌ములో వెల్ల‌డించాలి. ఇష్యూ ధ‌ర నిర్ణ‌యానికి గ‌ల అన్ని లెక్క‌ల‌ను వివ‌రించాలి.

See also  stock market investment for beginners: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి?

Leave a Reply

Your email address will not be published.