Communist parties Burgampahad : ఈ నెల 26న నిర్వహించే భారత్ బంద్కు వామపక్షాలు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ పార్టీ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నాయకులు ముద్ద భిక్ష తెలిపారు. బుధవారం బూర్గంపాడు మండల కమిటీ వామపక్షాల సమావేశం సారపాక సిపిఐ ఆఫీసులో అలవాల సీత రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక సాగు చట్టాల రద్దుకు రైతు సంఘాలు ఈనెల 26న భారత్ బంద్కు పిలుపు నిచ్చాయన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపు నిచ్చారని అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన 26వ తేదీ నాటికి నాలుగు నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా భారత్ బంద్ నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ బంద్కు మండలంలోని అన్ని వర్గాల వారు వ్యాపారస్థులు, దుకాణదారులు, బ్యాంకులు, బస్సులు, ఆటోలు, లారీల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా నాయకులు పేరాల శ్రీనివాసరావు, ఏఐటియూసీ అధ్యక్షులు ఎండి సాజిద్, సిపిఎం నాయకులు నరసింహారావు, ఎర్రమాల శివ, సిపిఐ నాయకులు మేలకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి