Commonwealth Games: కామ‌న్వెల్త్ క్రీడ‌లు ఎప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి?

Commonwealth Games: బ్రిటీష్ సామ్రాజ్యంలోని దేశాల మ‌ధ్య స్నేహ‌, సౌభ్రాతృత్వాలు పెంపొందించే విధంగా క్రీడా పోటీలు నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను రెవ‌రెండ్ యాష్లే కూప‌ర్ అనే మ‌తాధికారి తొలిసారిగా 1891లో వెలికి తెచ్చాడు. దీని అనుసారం 1928లో కెన‌డాకు చెందిన మెల్విల్లె మార్క్స్ రాబిన్స‌న్ అనే అథ్లెట్‌ ((Athlete))కు ఇలాంటి తొలి క్రీడా పోటీలు నిర్వ‌హించే బాధ్య‌త ఇవ్వ‌బ‌డింది. 1930లో కెన‌డాలోని హామిల్ట‌న్‌లో మొట్ట‌ మొద‌టిసారిగా వీటిని నిర్వ‌హించారు. అందులో 11 దేశాలు నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

నాలుగేళ్ల‌కొక సారి కామ‌న్వెల్త్ క్రీడ‌లు (Commonwealth Games 2022)

అప్ప‌టి నుంచి ఈ క్రీడా పోటీల‌న్నీ ప్ర‌తీ 4 ఏళ్ల కొక‌సారి (రెండ‌వ ప్రపంచ యుద్ధం కార‌ణంగా 1942,1946లో త‌ప్ప‌) నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. మొట్ట‌మొద‌ట్లో వీటిని బ్రిటీష్ సామ్రాజ్య క్రీడ‌లుగా పిలిచారు. 1954లో బ్రిటీష్ సామ్రాజ్యం, కామ‌న్వెల్త్ క్రీడ‌లు (Commonwealth Games) గానూ, 1970లో బ్రిటిష్ కామ‌న్వెల్త్ క్రీడ‌లు గానూ వీటి పేరు మార్చారు. 1978 నుంచి వీటిని కామ‌న్వెల్త్ క్రీడ‌లుగా పిలుస్తున్నారు. ప్ర‌స్తుతం 56 కామ‌న్వెల్త్ స‌భ్య దేశాల‌తో పాటు మొత్తం 72 దేశాలు త‌మ జ‌ట్ల‌ను పంపుతున్నాయి. మొద‌ట్లో అథ్లెటిక్స్ ఒక్క అంశంలోనే జ‌రిగిన ఈ పోటీలు 1998 కౌలాలంపూర్ క్రీడ‌లు నాటికి బాగా విస్త‌రించాయి.

ఒలింపిక్స్‌, ఆసియా క్రీడ‌ల త‌ర్వాత ప్ర‌పంచంలో జ‌రిగే మూడ‌వ అతిపెద్ద క్రీడాపోటీలివే. 2001వ సంవ‌త్స‌రంలో కామ‌న్వెల్త్ క్రీడా (Commonwealth Games) ఉద్య‌మం మాన‌వాళి, స‌మాన‌త్వం, ప్రారంబ్ధం అనే మూడు విలువ‌ల్ని చేప‌ట్టింది. ఈ విలువ‌లు కామ‌న్వెల్త్ దేశాల్లోని అనేక వేల మంది క్రీడాకారుల‌కు స్పూర్తిదాయ‌కంగా ప‌నిచేసి వారిని ఒక్క తాటి మీద స‌మైక్యంగా నిల‌బెడ‌తాయి. బ‌హుళ క్రీడాంశాలు క‌లిగిన ఈ పోటీల్లో కామ‌న్వెల్త్ దేశాల్లోని అత్యుత్త‌మ క్రీడాకారులంతా పాల్గొంటారు. కామ‌న్వెల్త్ దేశాల్లో మాత్ర‌మే క‌నిపించే లాన్‌బౌల్స్‌, నెట్ బాల్ వంటి క్రీడ‌ల్ని ఆడించ‌డం, ఆతిథ్య న‌గ‌రాల్ని ఎంపిక చేయ‌డం, త‌దిత‌రాలు జ‌రుపుతుంది. అన్ని కామ‌న్వెల్త్ క్రీడాపోటీల్లోనూ పాల్గొన్న దేశాలు ఆరే ఉన్నాయి.

కామ‌న్వెల్త్ క్రీడ‌లు బ‌హిష్క‌రించిన దేశం!

అవి ఆస్ట్రేలియా, కెన‌డా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్. కాగా కామ‌న్వెల్త్ క్రీడ‌ల‌ను బ‌హిష్క‌రించిన తొలి దేశంగా నైజీరియా చ‌రిత్ర‌లో నిలిచింది. ద‌క్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ క్రీడా సంబంధాల‌కు నిర‌స‌న‌గా 1978 (కెన‌డాలో జ‌రిగాయి) కామ‌న్వెల్త్ క్రీడ‌ల‌ (Commonwealth Games) ను నైజీరియా బ‌హిష్క‌రించింది. కాగా మ‌ళ్లీ 1986 (కెనడాలో జ‌రిగాయి) కామ‌న్వెల్త్ క్రీడ‌ల‌ను నైజీరియా బ‌హిష్క‌రించింది. కాగా మ‌ళ్లీ 1986 (స్కాట్లాండ్‌లో జ‌రిగాయి) కామ‌న్వెల్త్ క్రీడ‌ల‌ను రికార్డు స్థాయిలో 32 ఆఫ్రికా, క‌రీబియ‌న్ దేశాలు బ‌హిష్క‌రించ‌డం జ‌రిగింది. ద‌క్షిణాఫ్రికాతో క్రీడా సంబంధాల‌ను అప్ప‌టి బ్రిటిష్ ప్ర‌ధాని మార్గ‌రెట్ థాచ‌ర్ ఖండించ‌ని ఫ‌లితంగా 32 దేశాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి.

Share link

Leave a Comment