Devil Phobia : దెయ్యం భయ్యం Janagama : ఈ ఆధునిక కాలంలోనూ దెయ్యాల గురించి, మూఢనమ్మకాల గురించి పల్లెటూళ్ల ప్రజలు కథలు కథలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఏదో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, ఎవరైనా చనిపోయినా ఏమాత్రమూ ఆలోచించకుండా చేతబడి చేశారనో, దెయ్యం పట్టిందనో కొందరు అపోహలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతుందన్న వదంతులను నమ్ముతోన్న ప్రజలు ఏకంగా కాలనీ మొత్తాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లారు. కాలనీలో దాదాపు 40 కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరంతా బేడ బుడగ జంగాల కాలనీగా పిలువబడుతున్నారు. ఈ 40 కుటుంబాలు ఓ పాడుబడిన భవనంలో రాత్రి సమయంలో దెయ్యం తిరుగుతుందన్న భయంతో కాలనీ ఖాళీ చేశారు.
ఒక ఆడదెయ్యం నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని వందంతులు వ్యాపిస్తున్నాయి. ఆ కాలనీలో భాను, బాలరాజు అనే సోదరులు గతేడాది అక్టోబర్లో వారం వ్యవధిలోనే మృతి చెందారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణాల విషయంలో చేతబడి, దెయ్యమే కారణమని కాలనీ వాసులు నమ్ముతున్నారు. యువకులు మాత్రమే చనిపోతున్నారని అక్కడ ప్రజలు చెబుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని, కాబట్టి దెయ్యం వల్లే అనారోగ్యం వస్తోందని అక్కడి ప్రజలు అమాయకంగా మాట్లాడుతున్నారు. దెయ్యారు ఉండవని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆ కాలనీ వాసులు తమ తీరును మార్చుకోవడం లేదు.
దెయ్యం మూఢనమ్మకం
మూఢనమ్మకాలు పలు దేశాల సంస్కృతులలో సాంప్రదాయకంగా ప్రబలిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి ఈ ఆధునిక కాలం వరకు కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా తేలిపోయాయి. మూఢనమ్మకాలను ఎక్కువుగా చదువుకోనివారు, గ్రామాల్లోనూ, ఆదివాసీ గిరిజన సమూహాలలోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం మాత్రం చదువుకున్నవారు కూడా మూఢనమ్మకాలను బాగా నమ్ముతున్నారు.


- యువకులు చనిపోవడంతో భయాందోళన
- పాడుబడిన భవనంలో ఆడ దెయ్యమంటూ వదంతులు
- ఖాళీ చేసిన 40 కుటుంబాలు
ఒక మనిషి ఒత్తిడి కారణంగా మూఢనమ్మకాలు మనసులో బలంగా పాతుకుపోతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలు తేలింది. ఇది ఒక రుగ్మత. ఈ ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరగడంతో పాటు అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్టుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్లోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ గాలిన్క్సీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. జీవితం మీద అదుపు లేనట్టు భావించేవారు ఇతరులపై కొన్ని అభిప్రాయాల్ని రుద్దుతారని కనుగొన్నారు. తమ జీవితాల మీద నియంత్రణ కోల్పేయే కొద్దీ మానసిక జిమ్నాస్టిక్ ద్వారా పొందేందుకు వారు అంత ఎక్కువుగా ప్రయత్నాలు చేస్తారని ఆడమ్ వివరించారు. నియంత్రణ అనేది ప్రజలు చాలా ముఖ్యమని తెలిపారు. అపోహలను పెంచుకొని ఆత్మ సంతృప్తి పొందుతారని పేర్కొన్నారు. చదువుకున్న వారిలో కూడా మూఢనమ్మకాలు ఉండటానికి చిన్నతనంలో పెద్దలు చెప్పిందే వేదంలో పిల్లలు భావించడం, శాస్త్రీయపద్ధతి అంతగా ప్రబలకపోవడం, ఆదర్శవ్యక్తులుగా ఉండాల్సిన శాస్త్రవేత్తలు కొంతమంది అతీంద్రియ శక్తులు కనబరిచే బాబాలకు శిష్యులవ్వడం కూడా మూఢనమ్మకాలను ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది.
ఇది చదవండి:షరతులపై విరసం నేతకు బెయిల్ మంజూరు
ఇది చదవండి:కోవిడ్ వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల
ఇది చదవండి:ఖాకీ మాటున మానవత్వాన్ని చూపిన ప్రతి పోలీసుకు సెల్యూట్: డీజీపీ
ఇది చదవండి:మళ్లీ పంజా విప్పుతోన్న కరోనా
ఇది చదవండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు