Colon Hydrotherapy

Colon Hydrotherapy: గ్యాస్ స‌మ‌స్య‌ల‌కు కోల‌న్ హైడ్రోథెర‌పీతో నొప్పి లేని ప‌రిష్కారం!

Spread the love

Colon Hydrotherapy | ఇప్పుడు మ‌ల‌బ‌ద్ధ‌కం, గ్యాస్ స‌మ‌స్య‌, క‌డుపు ఉబ్బ‌రం లాంటి బాధ‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ వారికి చ‌క్క‌ని ప‌రిష్కారం చూపించే కొత్త చికిత్స కోల‌న్ హైడ్రో థెర‌పీ(Colon Hydrotherapy). అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న Colon హైడ్రో థెర‌పీతో మ‌ల‌బ‌ద్ధ‌కం, గ్యాస్ స‌మ‌స్య‌, ఇత‌ర జీర్ణ‌కోశ స‌మ‌స్య‌ల‌కు మంచి ప‌రిష్కారం అందిస్తుంది. దీనికోసం ఖ‌రీదైన మందులేవీ అక్క‌ర్లేదు. స్వ‌చ్ఛ‌మైన గోరువెచ్చ‌ని నీరు చాలు. పెద్ద‌పేగు లోప‌లికి ఈ నీటిని పంపించి దానిలో పేరుకుపోయి ఉన్న మ‌లినాల‌ను పూర్తిగా తొల‌గించి పేగు మొత్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌ట‌మే కోల‌న్ Hydrotherapy. స‌హ‌జ సిద్ధంగా కండ‌రాల్లో ఉండే సంకోచ వ్యాకోచాల‌ను ఈ therapy మ‌రింత మెరుగుప‌రుస్తుంది. శ‌రీరంలో నుంచి మ‌లినాల‌న్నీ వెళ్లిపోతాయి. కాబ‌ట్టి దీని వ‌ల్ల శ‌రీరం మొత్తం ఆరోగ్య‌వంతమ‌వుతుంది.

Colon Hydrotherapy ఎలా ప‌నిచేస్తుంది?

కోల‌న్ హైడ్రో థెర‌పీ అందించే ప‌రిక‌రాల్లో చాలా ర‌కాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. శుద్ధ్ Gravity డీయూ-01 వీటిలో ఒక‌టి. ఈ ప‌రిక‌రంలో నీరు వివిధ ద‌శ‌ల్లో ఫిల్ట‌ర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వ‌యొలెట్ water ఆ త‌రువాత రెక్ట‌మ్ ద్వారా లోప‌లికి వెళ్లి ఆ నీరు నెమ్మ‌దిగా పెద్ద‌పేగును చేరుతుంది. ఈ నీరు దేని ద్వారా కూడా పంపు చేయ‌బ‌డ‌దు. కేవ‌లం గురుత్వాక‌ర్ష‌ణ బ‌లంతో మాత్ర‌మే లోప‌లికి ప్ర‌వ‌హిస్తుంది. సుర‌క్షిత‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన‌, నియంత్రిత ఉష్ణోగ్ర‌త‌తో నీరు పెద్ద పేగును చేరుతుంది.

గోరువెచ్చ‌ని నీరు పెద్ద‌పేగును చేర‌గానే స‌హ‌జ‌సిద్ధంగా మ‌లినాల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. మృదువుగా మారిన మ‌లినాల‌న్నీ కింద ఉన్న కోలన్ Hydroథెర‌పీ టేబుల్ కింద‌కు చేర‌తాయి. ఇదంతా పూర్త‌వ్వ‌డానికి 40 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. వాస‌న‌ను బ‌య‌టికి పంపించే వ్య‌వ‌స్థ కూడా దీనిలో ఉంటుంది. కాబ‌ట్టి చికిత్స జ‌రిగేట‌ప్పుడు ఎటువంటి దుర్వాస‌న రాదు. ఈ ప్ర‌క్రియ కోసం డిస్పోజ‌బుల్ Rectal నాజిల్స్‌ను ఉప‌యోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవ‌డానికి రెండు గంట‌ల ముందు వ‌ర‌కు ఏమీ తిన‌కూడ‌దు.

కోల‌న్ హైడ్రోథెర‌పీ ఎన్నిసార్లు చేయించుకోవాల‌నేది పేషెంటు ఆరోగ్య ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెల‌లో 5 సార్లు ఒక ప్యాకేజీగా ఆసుప‌త్రుల్లో అందుబాటులో ఉంది. ఎటువంటి స‌మ‌స్య లేనివాళ్లు కూడా ఈ థెర‌పీ చేయించుకోవ‌చ్చు. దీని ఫ‌లితంగా మ‌ల‌బ‌ద్ధకం నివార‌ణ‌, క‌డ‌పుబ్బ‌రం, గ్యాస్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇరిట‌బుల్ bowel syndromeకి మంచి ప‌రిష్కారం ఉంటుంది. మ‌లినాల‌తో పాటు హానిక‌ర బాక్టీరియా వెళ్లిపోతుంది. కాబ‌ట్టి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

వీళ్ల‌కి వ‌ద్దు!

గ‌ర్భిణులు, పెద్ద‌పేగు, గ్యాస్ట్రో ఇంటెస్టిన‌ల్ ట్రాక్ట్‌కి సంబంధించిన తీవ్ర‌మైన స‌మ‌స్య‌లున్న‌వాళ్లు, హార్ట్ ఫెయిల్యూర్ స‌మస్య ఉన్న‌వాళ్లు, రెక్ట‌ల్ క్యాన్స‌ర్ ఉన్న‌వాళ్లు, అల్ప‌రేటిన్ కోలైటిస్, తీవ్ర‌మైన పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ థెర‌పీ చేయించుకోకూడ‌దు.

large intestine function: పెద్ద పేగు చేసే ప‌నులు ఏమిటో మీకు తెలుసా?

large intestine function: జీర్ణ వ్య‌వ‌స్థ అన‌గానే ముందుగా జీర్ణాశ‌య‌మే గుర్తుకొస్తుంది. కానీ పేగులు కూడా దీనిలోని భాగ‌మే. ముఖ్యంగా పెద్ద పేగు చేసే ప‌నుల గురించి Read more

immunity food:రోగ నిరోధ‌క శ‌క్తికి పెంపొందించే బెస్ట్ ఫుడ్ ఐట‌మ్స్‌

immunity food | మ‌న చుట్టూ నిరంత‌రం బోలెడ‌న్ని హానికార‌క సూక్ష్మ‌క్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వీటి భారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంది. దీంతో ర‌క‌ర‌కాల infectionన్లు, జ‌బ్బులు దాడిచేస్తాయి. Read more

Benefits of Kharbhuja: పోష‌కాలు పుష్క‌లంగా ఉన్న ఖ‌ర్భూజా పండుతో Healthకు మేలు!

Benefits of Kharbhuja | ఖ‌ర్భూజా పండు ఆరోగ్యాన్నిచ్చే అద్భుత వ‌న‌రుల ఖ‌జానా. దీనిలో పోష‌కాలు ఎక్కువుగా ఉన్నాయి. దీనిని పండ్ల‌కు రాజాధిరాజుగా చెప్ప‌వ‌చ్చు. Summer Season Read more

benefits of Sapota: ఆరోగ్య లాభాలు ఎన్నో.. ఎక్కువుగా తినాలనిపించే పండు ఇదే!

benefits of Sapota | స‌పోటా ఉష్ణ మండ‌లాల్లో పండే సంవ‌త్స‌రానికి రెండు కాపులు ఇచ్చే పండు. సంవ‌త్స‌ర‌మంతా దీని పూత ఉంటూనే ఉంటుంది. దీనిలో Latex Read more

Leave a Comment

Your email address will not be published.