Jaggayyapeta News Today

Jaggayyapeta News Today : వైద్య‌బృందాల అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వాసుప‌త్రిని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్

Jaggayyapeta : కృష్ణా జిల్లా జగ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలోని కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని క‌లెక్ట‌ర్ యండీ ఇంతియాజ్, రాష్ట్ర ప్ర‌భుత్వ విప్‌, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌బాను సంద‌ర్శించారు. అనంత‌రం స్థానిక వైద్యులు, అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వైద్య బృందాలు పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. స‌ర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివ‌రాలు సేక‌రించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌తిఒక్క‌రూ వ్యాక్సినేష‌న్ వేయించుకోవాల‌ని కోరారు.

ఆసుప‌త్రి సిబ్బందితో స‌మీక్ష‌లో మాట్లాడుతున్న క‌లెక్ట‌ర్ ఇంతియాజ్

ఈ కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్ఓ సుహాసిని, డీసీహెచ్ఎస్ జ్యోతిర్మ‌యి, జిల్లా ఆరోగ్యశ్రీ క్లినిక్స్ కో ఆర్డినేట‌ర్ మోతిబాబు, త‌హ‌శీల్దార్ రామ‌కృష్ణ‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సుభాష్ చంద్ర‌బోస్‌, ఎంపిడిఓ జ‌య‌చంద్ర గాంధీ, రాకేం ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆప‌రేష‌న్స్ ఎం. స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, సిఐ చంద్ర‌శేఖ‌ర్‌, ఎస్ఐ చిన్న‌బాబు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *