Krishna Covid-19 : జిల్లా అంత‌ట‌ మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా ఉన్నాం!

Krishna Covid-19 : జిల్లా అంత‌ట‌ మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా ఉన్నాం!

Krishna Covid-19 : క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నామ‌ని, అందుకు జిల్లా యంత్రాంగం మ‌రోసారి పూర్తి సంసిద్ధ‌త‌తో ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శుక్ర‌వారం స్థానిక ఎన్టీఆర్ డెంట‌ల్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ట్రైఏజ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎల్‌.శివ‌శంక‌ర్ తో క‌లిసి ప్రారంభించారు.

క‌రోనా కేసులు తిరిగి ఎక్కువుగా న‌మోదు అవుతున్నందున క‌రోనాను ఎదుర్కొనేందుకు అన్ని ముంద‌స్తు చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నామ‌న్నారు. తొలిసారి క‌రోనా వ‌చ్చిన స‌మ‌యంలో తీసుకున్న ముంద‌స్తు చ‌ర్య‌ల‌ను, గ‌త అనుభ‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌గ‌డ్భందీగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

తేలిక‌గా తీసుకోవ‌ద్దు!

క‌రోనా వైర‌స్‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఇది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని, మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అన్నారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం 104 కాల్ సెంట‌ర్‌ను ప్ర‌త్యేకంగా అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని, ఫోన్ చేసిన వ్య‌క్తి ల‌క్ష‌ణాలు తెలిపితే త‌గిన సూచ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు ఇస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

వ్యాధి తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు ఎన్టీఆర్ డెంట‌ల్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ట్రైఏజ్ కేంద్రంలో అత్యాధునిక వైద్య ప‌రిక‌రాన్ని అందుబాటులో ఉంచామ‌న్నారు. బి.పి, ఆక్సిజ‌న్ లెవ‌ల్‌, టెంప‌రేచ‌ర్ వంటి వివ‌రాలు తెలుపుతార‌న్నారు. రోగి ల‌క్ష‌ణాల మేర‌కు డాక్ట‌ర్లు సూచ‌న‌లు చేస్తార‌ని, హోం ఐసోలేష‌న్ కు ముందుకు వ‌చ్చే వారికి 14 రోజుల పాటు అందించే మందుల‌ను ఉచితంగా ఇస్తామ‌న్నారు.

వ్యాక్సినేష‌న్‌కు ఇబ్బంది లేదు!

క‌రోనా వ‌చ్చినా, అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్నా ట్రైఏజ్ సెంట‌ర్ ద్వారా ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌న్నారు. మంచి ఆహార‌పు అల‌వాట్ల‌తో క‌రోనాను జ‌యించ‌వచ్చ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. హోం ఐసోలేష‌న్ కు ఆస‌క్తి చూపే వారికి ఇంటిలోని మౌలిక స‌దుపాయాల‌ను ప‌రిశీలించి సిఫార్సుకు అనుమ‌తిస్తామ‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోవిడ్ సెకండ్ వేవ్ ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించార‌న్నారు. అధికారులు ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా అవ‌గాహ‌న పెంచాల‌ని స్ప‌ష్టం చేశార‌న్నారు. ఎవ్వ‌రూ కూడా క‌రోనాను తేలిక‌గా తీసుకోవద్ద‌ని, మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, శానిటైజ‌ర్ వాడ‌టం త‌ప్ప‌నిస‌రి అన్నారు. కోవిడ్ చికిత్స‌తో పాటు వ్యాక్సినేష‌న్ కూడా స‌మాంత‌రంగా చేప‌డుతున్నామ‌న్నారు.

అనుమానం ఉన్న‌వారికీ ప‌రీక్ష‌లు!

జాయింట్ క‌లెక్ట‌ర్ ఎల్‌.శివ‌శంక‌ర్ మాట్లాడుతూ..క‌రోనా వైర‌స్ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నా అనుమానం ఉన్నా పూర్తి స్థాయి ప‌రీక్ష‌ల‌ను చేస్తున్నామ‌న్నారు. 14 రోజుల‌కు స‌రిప‌డే మందుల‌ను హోం ఐసోలేష‌న్లో ఉండేవారికి ఉచితంగా అందిస్తున్నామ‌న్నారు. మందుల‌తో పాటు 14 రోజుల పాటు తీసుకోవాల్సిన మందుల వివ‌రాల‌తో ఇంగ్లీష్‌, తెలుగులో రూపొందించిన క‌ర‌ప‌త్రాన్ని కూడా హోం ఐసోలేష‌న్‌లో ఉండేవారికి అందిస్తున్నామ‌న్నారు. ఆహార నియ‌మావ‌ళిని కూడా బాధితుల‌కు డాక్ట‌ర్లు వివ‌రిస్తార‌న్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ ఈ కాల్ సెంట‌ర్ ద్వారా స‌రైన స‌మాచారం పొందాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిఎంహెచ్ఓ డా.యం.సుహాసిని, డిసిహెచ్‌య‌స్ ఆర్‌.జ్యోతిర్మ‌ణి, డెంట‌ల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.జి.యుగంధ‌ర్‌, ఆరోగ్య‌శ్రీ కోఆర్డినేట‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం ట్రైఏజ్ సెంట‌ర్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్ర ప‌రిక‌రం ద్వారా బి.పి, ఆక్సిజ‌న్ లెవెల్ ను క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌, జెసి శివశంక‌ర్ లు ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.

Share link

Leave a Comment