Cold Remedies: ఇది చలికాలం. చాలా మంది జలుబుతో ఇబ్బంది పడతారు. మందులేస్తే ఏడు రోజులు..లేకుంటే వారంలో తగ్గిపోతుంది. జలుబుపై వేసే జోక్ ఇది. ఏడు రోజుల దాకా అక్కర్లేదు. ఓ రెండు చిట్కాలతో దాన్ని మూడు నాలుగు రోజులకి కుదించవచ్చని చెబుతున్నారు వ్యాధి నిరోధక శాస్త్ర నిపుణులు.
ఏమిటా రెండు? ఒకటి, మామూలుకంటే ఎక్కువగా నీళ్లు తాగడం. రెండు, కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం. మొదట నీళ్ల సంగతి చూద్ధాం. సాధారణంగా జలుబు అనగానే చికెన్ సూపు తాగడం, ముక్కు దిబ్బడ తగ్గేలా ఆవిరి పట్టడం, జింక్ బిళ్లలు వేసుకోవడం వంటివి ఉపశమ నాన్నిస్తాయని చెబుతారు. కానీ వాటిన్నింటికన్నా గంటకు ఒకట్రెండు గ్లాసుల నీళ్లు తాగడం ఎన్నో రెట్లు బాగా పనిచేస్తుంది. ఎలా అంటారా?.
జలుబు మన శరీరం మ్యూకస్ (చీమిడి) ని తయారు చేస్తుంది. అదెంత ఎక్కువగా ఉత్పత్తయితే అంతగా వైరస్ బయటికి పోతుందన్న మాట. ఆ మ్యూకస్ తయారీకి నీళ్లు తప్పనిసరి. మీరు ఎంత ఎక్కువుగా నీళ్లు తాగితే అంతగా ఆ క్రిముల్ని మ్యూకస్ రూపంలో బయటకు గెంటే యొచ్చని చెబు తున్నారు వైద్యులు. ఇక నిద్ర కనీసం ఎనిమిది గంటలు తప్పనిసరి. ఈ విశ్రాంతితో మీ శక్తి మొత్తాన్ని వ్యాధినిరోధక వ్యవస్థ వైపు మళ్లించ వచ్చు. దాంతో జలుబు బాధల (Cold Remedies) నుండి త్వరగా బయటపడవచ్చు.
Cold Remedies: జలుబుకు ఇంటి వైద్యం
ఇంటిలో వేడినీటిలో పసుపుకు బదులుగా యూకలిప్టస్ ఆయిల్‌ను వేసుకున్నా మంచి ఫలితాన్ని పొందవచ్చు. పసుపును వేడిపాలలో చిటికెడు వేసుకొని తాగితే త్వరిగతిన జలుబు పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే సమయంలో పాలు తాగడం వల్ల రాత్రి సమయంలో జలుబు అంతగా బాధించదు.
అల్లం, దాల్చిన చెక్కలను చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని రెండు కప్పుల నీటిని తీసుకొని వాటిలో వేసి మరగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది. జలుబును తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాన్ని మింగడం ద్వారా జలుబును తగ్గించుకోవచ్చు. అలాగే తులసి టీ తాగినా కూడా జలుబు తగ్గుతుంది.
వెల్లుల్లిని బాగా నలిపి గంటకొకసారి బాగా వాసన పీలుస్తూ, ఆరు గంటలకొకసారి కొన్ని వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జలుబు తగ్గుతుంది. అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, చక్కెర కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందం టున్నారు వైద్యులు. పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకొని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏడు లేక ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేయించుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.