Coffee | కాఫీ, టీ తాగే ముందు సాధారణంగా మన పెద్దవాళ్లు గానీ, డాక్టర్లు చెప్పేది ఒక్కటే నీళ్లు తాగమని. అవును టీ, కాఫీ తాగడానికి ముందు నీళ్లు తాగడం చాలా మంచిది. ఎందుకంటే టీ, కాఫీలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే PH విలువను బట్టి ఆమ్లం, 7 ఉంటే తటస్థం, 7-14 ఉంటే క్షారం అని అంటారు. నీరు విలువ 7, అంటే తటస్థం. ఇక ఆమ్లం డైరెక్ట్‌గా పొట్టలోకి వెళితే అల్సర్లు, పేగులకు పుండ్లు, క్యాన్సరలను కలిగిస్తాయి. కాబట్టి వాటర్‌తో ఆమ్లం కలవడం వల్ల ఆమ్లం యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువుగా ఉంటుందట.
Coffeeతో వినికిడి సమస్య!
కంగారు పడకండి. ఇది అందరికీ వర్తించదు. భారీ శబ్ధాలను ప్రతిరోజూ చాలా దగ్గరగా వినేవారికి కాఫీ అలవాటు ఉన్నట్లయితే ఈ అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు. కెనడాలోని మెక్‌గ్రిల్ యూనివర్శిటీ పరిశోధకులు. నిర్మాణ రంగంలో పనిచేసేవారు, భారీ పేలుళ్లు, పబ్బులు వంటి ప్రదేశాలలో పనిచేసే వారి చెవులు సక్రమంగా పనిచేయవని వీరు అంటున్నారు. రెండు మూడు రోజుల వరకూ ఆ శబ్ధాల హోరు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందనీ, ఇలాంటి సమయంలో కాఫీ తాగితే వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వీరందరూ భారీ శబ్ధాల దగ్గర విధులు నిర్వర్తించే వారే కావడం విశేషం.
వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి పని స్థలంలోనే Coffee ఇచ్చారు. రెండో గ్రూపు వారికి కొన్ని గంటల అనంతరం కాఫీ ఇచ్చారు. అనంతరం వీరి వినికిడి శక్తిని పరిశీలించగా, భారీ శబ్ధాలు వింటూ అదే సమయంలో కాఫీ తాగిన వారిలో క్రమేపీ వినికిడి శక్తి నశించిన యథాతథంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. వీరిలో వినికిడి శక్తి తగ్గడానికి కాఫీనే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయం మీద వీరు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. భారీ శబ్ధాల దగ్గర పనిచేసే వారు కాఫీకి దూరంగా ఉంటేనే మంచిదని వీరు సూచిస్తున్నారు.


కాఫీతో హృద్రోగం మాయం!
ప్రొద్దున్నే వేడివేడి కాఫీ తాగందే, బుర్ర పనిచేయదు. Caffeine అనే పదార్థం వొంటికి అంత మంచిది కాదనీ,అదే పనిగా Coffee తాగేస్తూంటే లేనిపోనీ సమస్యలొస్తాయన్న మాట పక్కనపెట్టి ప్రతి రోజూ రెండు మూడు కప్పుల వేడి కాఫీ తాగడం వల్ల మహిళల్లో హృద్రోగం ఛాయలు 19 శాతం కనిపించలేదని యుఎస్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 83,076 మంది మహిళలపై జరిపిన పరిశోధనల ద్వారా ఈ సంగతి వెల్లడించారు. వీరంతా గతంలో విపరీతంగా సిగరేట్లు తాగేవారు. లేదా అస్సలు తాగని వారై ఉన్నారు. పొగ పీల్చేవారిలో 3 శాతం, పీల్చని వారిలో 43 శాతం పురోభివృద్ధి కనిపించినట్టు తెలిపారు. ఏది ఏమైతేనేం కాఫీ తాగడం వల్ల హృద్రోగాన్ని పారద్రోల వచ్చున్నమాట.
కాఫీ మితిమీరితే కష్టాలు తప్పవు!
కమ్మగా ఉందని కప్పులకు కప్పులు Coffee తాగడం అలవాటైతే ఊబకాయం సమస్యతో పాటు అనేక మొండి వ్యాధులను ఎదుర్కోక తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో వైద్య విజ్ఞాన పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. రోజుకు 5 కప్పులు కాఫీ మాత్రమే తాగుతున్నామని ధీమాగా ఉండేవారికి సైతం ఈ హెచ్చరికలు వర్తిస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కెఫిన్ లేని కాఫీ మాత్రమే తాగుతున్నామని చెప్పేవారు కూడా ఇక అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సందేనట.


ప్రపంచంలోనే తొలిసారిగా జరిపిన ఈ అధ్యయనంలో రోజుకు 5 కప్పులు మించి కాఫీ తాగుతున్న వారి ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అతిగా కాఫీ తాగేవారి పొట్టభాగంలో Fat భాగా పేరుకు పోతున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. Coffee లోని క్లోరోజనిక్ యాసిడ్ మితిమీరడం వల్ల కొవ్వు పేరుకు పోతుందని వారు నిర్థారించారు. శరీరానికి మేలు చేసే గుణాలు CGAలో ఉన్నప్పటికీ, అది మోతాదుకు మించి ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్లేనని పరిశోదకులు తేల్చారు. కాలానుగుణంగా కాఫీ తాగడంలో మార్పులు రావాలని వారు సూచిస్తున్నారు. మితిమీరి కాఫీ తాగడం ఏ విధంగా చూసినా ఒంటికి మంచిది కాదని పరిశోధకులు మరీ మరీ చెబుతున్నారు.