Coconut Cultivation

Coconut Cultivation: కొబ్బ‌రి చెట్లు పెంప‌కం లో పొడుగు చెట్టు మంచిదా? పొట్టి చెట్టు మంచిదా?

Spread the love

Coconut Cultivation: కొబ్బ‌రి చెట్ల సాగుకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న‌ది. క‌రోనా పుణ్య‌మాంటూ కొబ్బ‌రి బోండాల రేటు కూడా బాగానే పెరిగింది. అయితే కొబ్బ‌రి చెట్ల సాగు పెంప‌కం కొంద‌రి రైతుల‌కు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కావ‌చ్చు ఆ సాగుపై ఎక్కువ మ‌క్కువ చూప‌డం లేదు. కొబ్బ‌రి సాగు మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో, ఇక దేశంలో అయితే కేర‌ళ రాష్ట్రంలో ఎక్కువుగా సాగు అవుతుంది. అయితే కొబ్బ‌రి చెట్లు (Coconut Cultivation)పెంప‌కంపై మాకు దొరికిన కొన్ని విష‌యాల‌ను మీకు తెలియ‌జేస్తున్నాం.

పొడుగు చెట్టుకు- పొట్టి చెట్టుకు తేడా ఏమిటి?

పొడుగు కొబ్బ‌రి చెట్టు ను సాగు చేయాల‌నుకుంటే దిగుబ‌డి రావ‌డానికి సుమారు 7-8 సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌డుతుంది. పొట్టి కొబ్బ‌రి చెట్టును పెంచాలంటే దిగుబ‌డి రావ‌డానికి సుమారు 3-4 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. పొడుగు చెట్లు ఎక్కువుగా కొబ్బ‌రిని ఎక్కువుగా అందిస్తాయి. ఆయిల్ త‌యారు చేసే వారికి ఈ చెట్లు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. అలా అని ఆ చెట్ల కొబ్బ‌రి బొండాల్లో నీళ్లు ఉండ‌వ‌ని కావు. ఆ కొబ్బ‌రి బొండాల్లోనూ నీళ్లు ఉంటాయి. కాక‌పోతే కొబ్బ‌రి శాతం అధికంగా ఉంటుంది. పొట్టి కొబ్బ‌రి చెట్ల లో మాత్రం నీళ్లు శాతం అధికంగా ఉంటుంది.

అంత‌ర్ పంట‌లు వేసుకోవ‌చ్చా!

కొబ్బ‌రి తోట‌ల్లో కొన్ని అంత‌ర పంట‌లు కూడా వేసుకోవ‌చ్చు. ఎక్కువుగా కోకో పంట‌ను సాగు చేస్తుంటారు. ఈ పంట‌ను ఎక్కువుగా పొడుగైన కొబ్బ‌రి తోట‌లో ఎక్కువుగా వేస్తుంటారు. పొట్టి కొబ్బ‌రి తోట‌ల్లో వీటిని త‌క్కువుగా సాగు చేస్తుంటారు. కార‌ణం ఏమిటంటే కోకో పంట నీడ‌లో ఎక్కువుగా పెరుగుతుంది కాబ‌ట్టి. ఇంకా పొడుగాటి కొబ్బ‌రి తోట‌లు సాగు దాదాపు 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ దీని నుండి రైతు ఆదాయం పొంద‌వ‌చ్చు. పొట్టి కొబ్బ‌రి చెట్లు మాత్రం 10-15 సంవ‌త్స‌రాల వ‌ర‌కే ఉంటాయి. కేవ‌లం వీటిని కొబ్బ‌రి నీళ్ల కోస‌మే సాగు చేస్తున్నారు కొంద‌రు రైతులు.

న‌ర్స‌రీలో మ‌నం మొక్క‌ల‌ను కొనుగోలు చేయాల‌నుకుంటే..చెట్టుకు 5 ఆకులు ఉన్న ద‌శ‌లో ఎంచుకుంటే మంచిది. 6 నుంచి 8 ఆకులు ఉన్న కొబ్బ‌రి మొక్క‌లు చాలా మంచివి. మొక్క వ‌య‌స్సు 10-12 నెల‌లు వ‌య‌సు ఉండాలి. మొక్క యొక్క కాండం 10-12 సెం.మీ వ్యాసం క‌లిగి ఉండాలి. తెగుళ్లు, పురుగులు తాక‌ని మొక్క‌ల‌ను ఎంచుకోవాలి.

మీరే స్వ‌యంగా నారును పోసుకోవాలంటే.. త‌ప్ప‌కుండా చెట్టు యొక్క కాయ‌లు 80కి త‌క్కువ కాకుండా ఉండే చెట్టు నారును ఎంపిక చేసుకోవాలి. అలాగే కొబ్బ‌రి సుమారు 160 గ్రాములు ఉండేలా ఉన్న చెట్టు మొక్క‌ల‌ను ఎంచుకోవాలి. 20 సంవ‌త్స‌రాలు పైబ‌డిన చెట్టు మొక్క‌ల‌ను ఎంపిక చేసుకోవాలి. ఆకులు, మ‌ట్ట‌లు ధృడంగా ఉన్న చెట్టును ఎంపిక చేసుకోవాలి. ఆకులు సుమారు 30 క‌లిగి ఉన్న చెట్టును ఎంపిక చేసుకోవాలి.

కొబ్బ‌రి చెట్లు పెంప‌కం ముఖ్యంగా క‌ళేబ‌రాల‌కు, ప‌శువుల ఎరువు దిబ్బ‌ల‌కు దూరంగా సాగు చేయాలి. గౌత‌మి గంగ అనే కొబ్బ‌రి మొక్క‌లు సాగు ఇప్పుడు ఎక్కువుగా లాభ‌దాయ‌కంగా ఉంది. అలాగే కేర‌ళ గంగా అనే విత్త‌నం కూడా సాగు చేస్తున్నారు. గౌత‌మి గంగ 5-6 సంవ‌త్స‌రాల్లో పంట చేతికొచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా చాలా ర‌కాలు ఉన్నాయి.

కాయ విత్త‌నం మొక్క‌ నాటేట‌ప్పుడు 30 సెం.మీ వెడ‌ల్పు, పొడ‌వు మ‌ధ్య నాటాలి. మొక్క‌ను నాటేట‌ప్పుడు చెద‌ల నుండి కాపాడుకోవాలి. మొక్క‌ను మూడు వ‌రుస ప‌ద్ద‌తు(7.6 సెంమీ. పొడ‌వు, వెడ‌ల్పు)ల్లో అలాగే స్వేర్ ప‌ద్ద‌తిలో కూడా (7.6 సెం.మీ పొడ‌వు, వెడ‌ల్పు) ఒక వ‌రుస అయితే (9 సెం.మీ పొడ‌వు వెడ‌ల్పు) ప‌ద్ధ‌తుల్లో మొక్క‌ను నాటుకోవ‌చ్చు.

Dried mango leaves: ‘ఎండిన మామిడి ఆకులు కొంటాం బాబూ’..అంటున్న ఓ సంస్థ‌!

Dried mango leaves కేర‌ళ: మామిడి పండ్ల‌ను కొనేవారిని చూశాం. బాగా తినేవారినీ చూశాం. కానీ ఈ విచిత్ర‌మేమిటో ఎండిపోయిన ఆకుల‌ను కొనేవారిని ఎప్పుడైనా చూశారా? ఇలా Read more

kerala:భార్య‌ల‌ను మార్చుకుంటున్న ఘ‌ట‌న ఎక్క‌డంటే?

keralaకేర‌ళ‌లో భారీ సెక్స్ రాకెట్ స్కాడింల్ గుట్టు ర‌ట్ట‌యింది. లైంగిక వాంఛ తీర్చుకోవ‌డానికి భాగ‌స్వాముల‌ను మార్చుకుంటున్న వ్య‌వ‌హారాన్ని పోలీసులు చేధించారు. ఈ ఘ‌ట‌న‌తో సంబంధమున్న ఏడుగురిని అరెస్టు Read more

TSRTC శుభ‌వార్త: అయ్య‌ప్ప స్వాముల‌కు 200 ప్ర‌త్యేక బ‌స్సుల ఏర్పాటు

TSRTCహైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌లైకు వెళ్లే అయ్య‌ప్ప‌స్వాముల‌కు టిఎస్ఆర్‌టిసి సంస్థ(TSRTC) శుభ‌వార్త తెలిపింది. శ‌బ‌రిమ‌ల‌కు 200 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు Read more

kerala lockdown: కేర‌ళ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా.. సంపూర్ణ లాక‌డౌన్ దిశ‌గా ప్ర‌భుత్వం

kerala lockdown: దేశంలో కేర‌ళ‌లోని క‌రోనా వైర‌స్ ఆందోళ‌న‌క‌ర స్థాయిలో విజృంభిస్తోంది. అక్క‌డ 20 వేలకు పైన కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైర‌స్ వ్యాప్తిని Read more

Leave a Comment

Your email address will not be published.