Telangana CM KCR : 10న నల్గొండకు సీఎం కేసీఆర్
Telangana CM KCR : Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 10వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రూ.3000 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో జరిగే టిఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్రవారం ప్రగతి భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని సాగునీరు అందుతున్న ప్రాంతాలు మినహా మిగిలిన ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అనువుగా రూ.3000 వేల కోట్ల వ్యయంతో నెల్లికల్లు సహా 8,9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లు సహా ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ నెల్లికల్లులో ఒకే చోట 10వ తేదీన శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా!
ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సంతకం చేశారు. విధి నిర్వహణలో అనవసర వేధింపులకు గురవుతున్నారని ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలను రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు
ఇది చదవండి:శశికళకు అనుమతి ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు!
ఇది చదవండి: ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఇది చదవండి:గుంటూరు జిల్లా కలెక్టర్‌గా Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక